desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:35AM

సైట్‌లో 50 లక్షల జీమెయిల్‌ అకౌంట్ల వివరాలు

 పాస్‌వర్డ్‌లతో సహా వెల్లడైన వైనం
వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 11: మీకు జీమెయిల్‌ అకౌంట్‌ ఉందా...కనిపించిన ప్రతి వెబ్‌సైట్‌కూ దాని వివరాలు అప్‌లోడ్‌ చేస్తూ పోతున్నారా..? అయితే ఒక్క క్షణం ఆగండి. ఇకపై అలా కనిపించిన ప్రతి సైట్‌కూ మీ అకౌంట్‌ వివరాలు ఇవ్వడం అంత క్షేమకరం కాదు. ఎందుకంటే, గురువారం వెలుగుచూసిన ఓ ఘటన, దాదాపు 50 లక్షల మంది నెటిజన్లను తీవ్ర ఆందోళనలో పడేసింది. ర ష్యాకు చెందిన బిట్‌కాయిన్‌ ఫోరమ్‌లో 50 లక్షల మంది జీమెయిల్‌ అకౌంట్‌ వివరాలు ప్రత్యక్షమయ్యాయి. అంతేనా, అత్యంత రహస్యంగా ఉండే, సదరు అకౌంట్ల పాస్‌వర్డ్‌లూ ఆ సైట్‌లో కనిపించి కలక లం రేపాయి. దీంతో సదరు అకౌంట్‌ వినియోగదారులు ఉరుకులు పరుగులు పెట్టారు. బిట్‌కాయిన్‌లో కనిపించిన పాస్‌వర్డ్‌లు, తమ అకౌంట్లవి కాదని తేల్చుకున్న తర్వాత కాని వారి ఆందోళన తగ్గలేదట. వివిధ వెబ్‌సైట్లలో తమ పేర్లు రిజిష్టర్‌ చేసుకునే క్రమంలో నెటిజన్లు తమ జీమెయిల్‌ అకౌంట్లను వెల్లడిస్తున్నారు. ఈ విధంగా ఆయా సైట్ల నుంచి గుట్టుచప్పుడు కాకుండా సేకరించిన ఆకతాయిలు ఈ ఘటనకు కారణమని భద్రత రంగ నిపుణులు భావిస్తున్నారు. పాస్‌వర్డ్‌లను కూడా వివిధ సైట్లలో కనిపించే ‘‘మై పాస్‌వర్డ్‌’’ విభాగాన్ని క్లిక్‌ చేయడం ద్వారా వెల్లడై ఉంటాయని కూడా వారు ఓ అంచనాకు వచ్చారు. ుఽ్‌బేుఽ్చ’్ఝఓ =