Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 12 2014 @ 00:19AM

నష్ట పరిహారం చెల్లించాలని రాస్తారోకో


ఆసిఫాబాద్‌ రూరల్‌/ ఆసిఫాబాద్‌: ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పత్తి పంటపై అధికారులు సర్వే నిర్వహించి నష్ట పరిహారం మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం స్థానిక అంబేద్కర్‌ చౌక్‌ ఎదుట గల అంతరాష్ట్ర రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈరాస్తారోకోకు కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు పలికాయి. వర్షాలకు పత్తి చేనులలో నీరు నిలిచి పంటలు దెబ్బతిన్నాయన్నారు. పత్తి చెట్లను తీసుకు వచ్చి రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు వచ్చేవరకు కదిలేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని రాస్తారోకో విరమించాల్సిందిగా కోరినా వారు ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు వైరగాడే గోవింద్‌, సెండె దత్తు, బద్రి సత్యనారాయణ, ఆత్మారాం, లోకేష్‌, రైతు రమేష్‌లు మాట్లాడుతూ ప్రభుత్వం పంట రుణాలు మాఫీ అని చెప్పుతున్నప్పటికీ రుణ మాఫీ కాకపోవడంతో తమకు ఈ ఏడాది రుణాలు అందక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అలాగే ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంట దెబ్బతిందన్నారు. ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని, రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ ఇమ్రాన్‌ఖాన్‌ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోతానని ఆందోళన విరమించాలని రైతులను కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని రైతులు, నాయకులు తహసీల్దార్‌కు అందజే శారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు గోపాల్‌, తన్వీర్‌, రవీందర్‌, జాలీంషా, చిట్ల సురేష్‌, కిష్టయ్య, బాబురావు, తదితరులు పాల్గొన్నారు. ళి’ఫ జిహది,దిఛబ,