Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 22:29PM

వామ్మో.. గురకా!

‘హార్ట్‌ ఎటాక్‌’లో నితిన్‌ సరసన నటించిన హీరోయిన్‌ ఆదాశర్మ. ఈ ఉత్తరాది భామ సినిమాలను ఒప్పుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా ఆది సినిమా ‘గరమ్‌’కు సంతకం చేసింది. ఈ మధ్య ఆదాశర్మకు ఫ్లైట్‌లో ఓ సంఘటన ఎదురైంది. దీని ద్వారా జీవితంలో అతి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోగలిగాను అని ట్వీట్‌ చేసింది ఆదా. ఇంతకీ ఆ విషయం ఏమిటంటే.. ‘‘నేను చేసుకోబోయే వ్యక్తికి ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలి. వాటిలో ఒకటి. అతను జంతు ప్రేమికుడు అయి ఉండాలి. రెండోది అతను గురక పెట్టకూడదు’’ అని. ఫ్లైట్‌లో ఆదా పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి పెట్టిన గురక ఆమెలో భయాన్ని పుట్టించిందట. ఈ విషయాన్నే సన్నిహితులతోనూ పంచుకుందీ చిన్నది. ఆదాశర్మ కథక్‌ డ్యాన్సర్‌. దీని గురించి చెబుతూ ‘‘నేను ట్రెయిన్డ్‌ బెల్లీ డ్యాన్సర్‌ని. కథక్‌ డ్యాన్సర్‌ని. జిమ్నాస్టిక్స్‌ కూడా తెలుసు. అవన్నీ సినిమాల్లో చూపించుకోగలిగే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను’’ అని వివరించిందీ చిన్నది.