Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 22:14PM

ఆరోగ్యానికి పరీక్ష

ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా డాక్టర్‌ దగ్గరకు వెళతాం. కొన్ని పరీక్షలు చేయించుకురండని చీటీ రాసి పంపిస్తాడు డాక్టర్‌. దగ్గర్లోని డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు వెళతాం. అక్కడి లాబ్‌ టెక్నీషియన్స్‌ రక్తాన్ని సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌కు పంపిస్తారు. ఆ తర్వాత రిపోర్టు ఇస్తారు. ఆ రిపోర్టు ఆధారంగానే డాక్టర్‌ రోగికి చికిత్స చేస్తారు. అయితే ప్రతీ నగరంలో, పట్టణంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న డయాగ్నోస్టిక్‌ సెంటర్స్‌, మెడికల్‌ ల్యాబ్‌లు ఖచ్చితమైన రిపోర్టులనే ఇస్తున్నాయా? అంటే కచ్చితంగా కాదంటున్నారు అమీరా షా. మనదేశంలో ప్రసిద్ధి చెందిన ‘మెట్రోపాలిస్‌ హెల్త్‌కేర్‌’ డయాగ్నొస్టిక్స్‌కు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవోగా చేస్తున్న ఆమె ఇటీవల గోవాలో మూడు రోజులపాటు జరిగిన ‘హీల్‌’ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు...
మన దేశంలో సుమారు 50 వేల నుంచి 75 వేల దాకా మెడికల్‌ లాబొరేటరీలున్నాయి. అయితే వీటిలో ప్రభుత్వ అక్రిడేషన్‌ ఉన్నవి కేవలం 300 మాత్రమే.
. అంటే మిగతావన్నీ గుర్తింపు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నాయన్నమాట. వీటి మీద అటు మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ అజమాయిషీగానీ, ఇటు ప్రభుత్వం అజమాయిషీగానీ ఉండట్లేదు.
. ప్రతీ పేషంట్‌కు రోగనిర్ధారణ చేయాలంటే డాక్టర్లు రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, మల పరీక్షల మీదనే ఆధారపడతారు.
. ఎవరూ ఊహించని విషయం ఏమిటంటే... ఆయా నగరాల్లో, పట్టణాల్లో లాబ్స్‌ జరుపుతున్న పరీక్షల్లో కచ్చితత్వం ఉండట్లేదు.
. కొన్ని లాబ్స్‌ 80 రూపాయలకే పరీక్ష చేస్తే, మరికొన్ని లాబ్స్‌ 800 రూపాయలకు చేస్తున్నాయి. వీటిలో పేషెంట్‌ దేన్ని నమ్మాలో తెలియక తికమకపడుతున్నాడు.
. మినిమమ్‌ స్టాండర్ట్స్‌ కూడా లేని లాబ్స్‌ మనదేశంలో వేల సంఖ్యలో ఉన్నాయి. పేషంట్ల అవగాహనలేమి, ఆరోగ్యంతో ఇవన్నీ ఆటలాడుకుంటున్నాయి.
. అందుకే అన్ని డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడాకనీసమైన నాణ్యతలు పాటించేలా ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలు విధించాలి.
. పేషెంట్‌కు పరీక్షలు చేసిన తర్వాత ఇచ్చే రిపోర్ట్స్‌ విషయంలో ట్రాన్ప్‌పరెన్పీ ఉండాలి. విదేశాల్లో ఒక బ్లడ్‌ శాంపిల్‌ను ఏ విధంగా టెస్ట్‌ చేశామనే సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచుతారు. కానీ మనదగ్గర రిపోర్టులో పూర్తి సమాచారం లభించట్లేదు.
. హెల్త్‌కేర్‌లో డయాగ్నోస్టిక్‌ సెంటర్లు, లాబ్స్‌ ప్రాథమిక సమాచారాన్ని అందిస్తాయి కాబట్టి వాటి విషయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది ప్రాణాలకే ముప్పుగా మారే ప్రమాదం లేకపోలేదు. అందుకే పేషంట్స్‌ నమ్మదగ్గ, అక్రిడేషన్‌ ఉన్న లాబ్‌లలో మాత్రమే పరీక్షలు చేయించుకుంటే మంచిది.
- చల్లా శ్రీనివాస్‌