Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 18:48PM

ఏబీఎన్‌ చేసిన తప్పేంటని ప్రశ్నించిన మహిళా జర్నలిస్టులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 : జాతీయ మీడియా టీ. సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కథనాలు ప్రసారం చేస్తుంటే స్థానిక మీడియా ఆ పని ఎందుకు చేయలేకపోతోందని ఏబీఎన్‌, టీవీ9 మహిళా జర్నలిస్టులు ప్రశ్నించారు. భవిష్యత్తులో మరే చానల్‌కు ఈ పరిస్థితి రాకూడదంటే ఇప్పటికైనా మీడియా మొత్తం ఏకం కావాలని జర్నలిస్టులు పిలుపునిచ్చారు.
 
మీడియాపై కక్ష సాధించడం లేదంటున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏబీఎన్‌ చేసిన తప్పు ఏమిటన్నది చెప్పాలని, తెలంగాణ ఎమ్మెల్యేలను గానీ, తెలంగాణ సంస్కృతినిగానీ ఏబీఎన్‌ ఎప్పుడు అవమానించిందో చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా జర్నటిస్టులపై పోలీసుల తీరు ఎంతో అరాచకంగా ఉందని, తర్వాత కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని ఏబీఎన్‌ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ సుధారాణి ఆవేదన వ్యక్తం చేశారు.