Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 17:04PM

లండన్‌లో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు

లండన్‌, సెప్టెంబర్‌ 11 : హైదరాబాద్‌ ఫ్రెండ్స్‌ యూత్‌ సంస్థ ఆధ్వర్యంలో లండన్‌లో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ ఎత్తున భజనలు ఆటపాటలతో లండన్‌ వీధుల్లో కార్యక్రమం వైభవంగా జరిగింది. వివిధ రాష్ర్టాలకు చెందిన కుటుంబాలు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
 
గణపతి బప్పా మోరియా, భారత్‌ మాతాకీ జై అంటూ లండన్‌ వీధులు మార్మోగాయి. బ్రిటిష్‌ వారు సైతం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. సంస్థ అధ్యక్షులు దాసరి అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ ఒక కాస్మోపాలిటన్‌ నగరంగా ఎలాగైతే వివిధ ప్రాంతాలు, మతాల ప్రజలు కలిసిమెలిసి ఉంటారో ఇక్కడ కూడా అందరినీ కలుపుకుని ఈ వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమానికి సహాయసహకారాలు అందించిన అన్ని సంస్థలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
 
ఈ వేడుకల్లో ఎన్నారైటీఆర్‌ఎస్సెల్‌ అధ్యక్షులు అనిల్‌ కురమంచలమ్‌, టీఈఎన్‌ఎఫ్‌ అధ్యక్షుడు సీకా చంద్రశేఖర్‌, టీఈఎన్‌ఎఫ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ పవిత్ర రెడ్డి, అడ్వైజర్‌ ఉదయ నాగరాజు ముఖ్యఅతిథులుగా హాజరై పూజలు నిర్వహించారు. ఈవెంట్‌ నిర్వహకులు గోలి తిరుపతి, కవిత, కసర్ల నగేష్‌రెడ్డి, జ్యోతి, వంశీ, దీప్తి, శశిధర్‌, సుమన్‌ గోలి, మల్లరెడ్డి, శుష్మన, శ్రావణ్‌రెడ్డి, సుధాకర్‌, శౌరి, జితేందర్‌, సతీష్‌, మోహన్‌, సందీప్‌ గౌడ్‌, ఎల్లేందర్‌, మధు, రాజ్‌ బజార్‌, సత్యంన, సంగిరెడ్డి గుప్త కసం, వెంకట్‌రెడ్డి, విష్ణు, ఓం ప్రకాష్‌, కిషోర్‌నరేష్‌ తదితరులు పాల్గొన్నారు.