Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 15:09PM

బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌పై కేసు నమోదు

లక్నో, సెప్టెంబర్‌ 11 : ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌పై పోలీసు కేసు నమోదు అయింది. యోగి ప్రచారం చేయరాదంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు ఆదిత్యనాథ్‌పై కేసు నమోదు అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లో శనివారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు బీజేపీ ప్రధాన కర్తగా యోగి వ్యవహరిస్తున్నారు.
 
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ యోగి ప్రచారం చేయకుండా యూపి ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. కానీ వాటిని ఆదిత్యనాథ్‌ ఉల్లంఘించి బుధవారం లక్నోలో బహిరంగసభలో పాల్గొన్నారు. అఖిలేష్‌ యాదవ్‌ ప్రభుత్వం నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే తనపై నిషేధం విధించారని ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. మరోవైపు ఆదిత్యనాథ్‌ ఎన్నికల ప్రచాన ప్రసంగాన్ని ఎన్నికల కమిషన్‌ పరీక్షించనుంది.