Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 15:05PM

ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించకపోతే కేసీఆర్‌కు సమస్యలు తప్పవు ... మీడియా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం :
ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ ఖట్జూ

 న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 11 : తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 ప్రసారాలను పునరుద్ధరించకపోతే కేసీఆర్‌కు సమస్యలు తప్పవని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మార్కండేయ ఖట్జూ హెచ్చరించారు. మీడియాపై కేసీఆర్‌ వ్యాఖ్యలు, ఆయన ఉపయోగించిన భాష అభ్యంతరకరమన్నారు.

ఇకనైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన భాషను మార్చుకోవాలని ఖట్జూ సూచించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన చెప్పారు. ఏబీఎన్‌ ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ప్రసారాలను నిలిపివేశారని ఖట్జూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఒత్తిడితోనే ఎంఎస్‌వోలు ప్రసారాలు నిలిపివేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఛానెళ్ల ప్రసారాలు పుననరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, భవిష్యత్‌లోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన సూచించారు. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆదేశాలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని మార్కండేయ ఖట్జూ స్పష్టం చేశారు. పత్రికా స్వాతంత్య్రం రాజ్యాంగ బద్ధంగా వచ్చిందని, దీనిని హరించడం ఎవరితరమూ కాదని, ఇది ప్రజాస్వామిక దేశం అన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆయన ఎంఎస్‌ఓలను హెచ్చరించారు.