Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 14:41PM

చానెళ్ల ప్రసారాలు నిలిపివేత దురదృష్టకరం : డీఎస్‌

మెదక్‌, సెప్టెంబర్‌ 11 : తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 ప్రసారాలను నిలిపివేయడం దురదృష్టకరమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ డి. శ్రీనివాస్‌ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం అండతోనే ఎంఎస్‌వోలు రెండు చానెళ్ల ప్రసారాలు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ఇప్పటికైనా గవర్నర్‌ చొరవ తీసుకుని చానెళ్ల ప్రసారాలను పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని డీఎస్‌ కోరారు.