Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:45AM

ఖరీఫ్‌ ధాన్యం సేకరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి


భువనగిరి : ఖరీఫ్‌ ధాన్యం సేకరణకోసం వెంటనే కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయా లని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ పార్థ సారథి ఆదేశించారు. బుధవారం భువనగిరి ఆర్డీవో కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ ప్రీతి మీనాతో కలిసి ఆయన ఆ శాఖ జిల్లా అధికా రులు, డివిజన్‌స్థాయి రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పంట విస్తీర్ణం, సాగు దిగుబడి దృష్టిలో ఉం చుకొని మార్కెట్‌ యార్డును, ఐకేపీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు టార్పిన్లు, తేమ కొలిచే సాధనాలు, ధాన్యం రవాణా తదితర వసతులపై చర్చిం చారు. జిల్లాలో గత ఖరీఫ్‌ సీజన్‌లో 50 ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసి 3లక్షల 68వేల 202 టన్నుల ధాన్యాన్ని సేకరించామని, ప్రస్తుతం 80 కేంద్రాలు ఏర్పాటు చేసి 6లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు అధికారులు సన్న ద్ధం కావాలని సూచించారు. మండల స్థాయి టీంలను ఏర్పాటు చేసి నాణ్యమైన ధాన్యాన్ని సేకరించాలన్నారు.
బోగస్‌కార్డులను ఏరివేయాలి...
బోగస్‌ కార్డులను వారం రోజుల్లోగా ఏరివే యాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ పార్థసారథి కోరారు. జిల్లాలోని మండలాల తహసీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికా రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్‌కార్డులకు ఆధార్‌ అనుసంధా నాన్ని నూరు శాతం పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ఆధార్‌ సీడింగ్‌ 85శాతం మాత్రమే పూర్తయిందన్నారు. ప్రభుత్వం నుంచి అందే ఈ-మెయిల్‌ను స్వయంగా పరిశీలించాలని లేనిచో తగు చర్యలు తప్పవని ఆయన హెచ్చ రించారు. వీడియో కాన్షరెన్స్‌లో జేసీ ప్రీతి మీనా, భువనగిరి ఆర్డీవో ఎన్‌.మధుసూదన్‌, డీఎస్‌వో నాగేశ్వర్‌రావు, జీఎం మార్కెటింగ్‌ కళాధర్‌రావు, ఎఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్‌, డీసీవో ప్రసాద్‌, డీఎంసీఎస్‌ వరకుమార్‌ ఉన్నారు.