Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:44AM

లారీ ఢీకొని యువకుడి దుర్మరణంబాల్కొండ: మండల కేంద్రంలోని 44 వ జాతీయ రహదారిపై లారీ ఢీకొన్న ఘటనలో బండి నవీన్‌కుమార్‌(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ఏఎస్సై చందయ్య తెలిపిన వివరాలు ఇ లా ఉన్నాయి. బాల్కొండ మండల కేం ద్రం నడిమిగల్లికి చెందిన నవీన్‌కుమార్‌ ఉదయం 11గంటలకు బైక్‌ (ఏపీ25 ఆర్‌ 2011)పై ఆర్మూర్‌కు బయలుదేరాడు. ఓ ప్రైవేటు పాఠశాల ఎదురుగా వెనుక ను ంచి హర్యానాకు చెందిన లారీ(హెచ్‌ఆర్‌ 38ఎస్‌6729) అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో నవీన్‌ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందా డు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్టు ఏఎస్సై చెప్పారు. మృతుడికి భార్య, సంవత్సరం లోపుకుమారుడు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమా ర్టం కోసం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఏఎస్సై పేర్కొన్నారు.ఛిటట=ఛజీుఽజుఠబీాఛి