Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:43AM

ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలి


నిజామాబాద్‌ రూరల్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చేసిన రైతు రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని బోర్గాం (పి) ప్రాథమిక సహకార సంఘం పా లకవర్గం తీర్మానించింది. బుధవారం మండలంలోని బోర్గాం (పి) ప్రాథమిక సహకార సంఘం పాలకవర్గం అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతాంగాన్ని మభ్యపెట్టే మాటలు మాట్లాడకుండా వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ని లబెట్టుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్ర భుత్వం పూటకోమాట మాట్లాడుతూ రైతాం గాన్ని మభ్యపెట్టడం మంచిది కాదన్నారు. ఇ ప్పటికే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేస్తానని చెప్పినప్పటికీ ఇప్పుడు కొత్త కొత్త విధి విధానాలను తీ సుకురావడం ఎంతవరకు సమంజసమన్నా రు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు రు ణమాఫీ అని చెప్పి వేల కోట్ల రూపాయలను మాఫీ చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ వి షయంలో జాప్యం చేయడం సరైంది కాదన్నా రు. రైతులు రోడ్డు ఎక్కకముందే తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రుణమాఫీని ఎటు వంటి ఆంక్షలు లేకుండా అమలు చేయాలన్నా రు. సమావేశంలో మాధవనగర్‌ సింగిల్‌ విం డో అధ్యక్షుడు ప్రమోద్‌, డైరెక్టర్లు రాజశేఖర్‌రెడ్డి గంగాధర్‌, కృష్ణయ్య, సంజీవ్‌, గంగారెడ్డి, నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌ చిట్టి సాయిరెడ్డి ఆ యా గ్రామాల రైతులు పాల్గొన్నారు.ౄఆ/