Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:42AM

ఆర్యనగర్‌ ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట కాంట్రాక్టు కార్మికుల నిరసన


నిజామాబాద్‌ రూరల్‌: యాజమాన్యమే తెలంగాణ విద్యుత్‌ కార్మికులకు నేరుగా జీతా లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం మండలంలోని ఆర్యనగర్‌ ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట నల్ల చొక్కాలు ధరించి కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవ డం లేదని తెలంగాణ విద్యుత్‌ కాంట్రాక్టు ఎం ప్లాయిస్‌ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం అయ్యేం త వరకు ఈనెల 10 నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు ట్రాన్స్‌కో కార్యాలయాల ఎదుట తమ నిరసన కొనసాగుతాయన్నారు. 13న జిల్లాలో డీఈ ఆఫీస్‌ల ముందు లంచ్‌ హవర్‌లో ధర్నా, 19న హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో డీఈ ఆఫీసుల ముందు ధర్నా, 20న పది జిల్లాల్లో ఈఈ సర్కిల్‌ కార్యాలయాల ఎదు ట ధర్నా, 25న సీఎండీ ఆఫీస్‌ ముందు ధర్నా, అక్టోబర్‌ 7న ఛలో హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా, 9న కార్మికులందరూ సమ్మెలో కి వెళా ్తరన్నారు. అప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాకపోతే కార్యాచరణ ప్రణాళిక మరో విధంగా ఉందని నాయకులు హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో కాంట్రాక్టు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జూో1రో5శీఆ