Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:42AM

హామీలు ఘనం.. అమలు శూన్యం


ఆర్మూర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వ వంద రోజుల పాలనలో హామీలు ఘనంగా, అమలు శూన్యంగా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వీజీ.గౌడ్‌ వి మర్శించారు. బుధవారం ఆర్‌అండ్‌బీ ఆర్మూర్‌లోని అతిథి గృహంలో మాట్లాడారు. కేబినెట్‌ సమావేశంలో 40, 45తీర్మానాలు చేసినా ఒక్క దాన్నీ ఇంత వరకు అమలు చేయలేదన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి కు టుంబాలను ఆదుకుంటామన్న హామీని నిలబెట్టుకోలేదని, కేవలం ఒకటి, రెండు కుటుంబాల కు నామాత్రంగా సాయం చేశారన్నారు. పంట రుణాల మాఫీకి టైటిల్‌ డీడ్‌, పట్టాదారు పా సుప్తుకాలు, సర్వే నెంబర్లు అంటూ ఇబ్బందు లు పెడుతున్నారన్నారు. రుణమాఫీ అస్తవ్యస్త ంగా తయారైందని ఆరోపించారు. జిల్లాలో 80 వేల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, వీటికి ఆరు నెలలుగా ఒక్క రూపాయి విడుదల చేయడంలేదని, ఒక్క ఇంటికి మూడు లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారని, మూడున్నర లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించినా ఇంత వరకు అమలు చేయడంలేదన్నారు. ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ జా ప్యం చేయడం వల్ల విద్యార్థులు ఇతర రాష్ట్రాల కు వెళ్లిపోయారని, ఫాస్ట్‌ పథకం, పింఛన్ల మీ ద స్పష్టత లేదన్నారు. విద్యుత్‌ సరఫరాలో ప్ర భుత్వం విఫలమైందన్నారు. అధికారంలోకి రా గానే ఎనిమిది గంటలు, మూడేళ్ల తర్వాత 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తామని హామీ ఇ చ్చి ఐదు గంటలైనా సరఫరా చేయడంలేదన్నా రు. గ్రామాల అభివృద్ధికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నారిటీ కార్పొరేషన్లకు ఒక్క రూపాయీ విడుద ల చేయలేదన్నారు. ప్రజా సమస్యలపై నిలదీద్దామన్నా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఏర్పా టు చేయడంలేదన్నారు. డీఆర్‌సీ సమావేశం పెట్టడంలేదని అన్నారు. చంద్రబాబు హయాం లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తే, కేవలం హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారని, ప్రస్తుతం కేసీఆర్‌, కేటీఆర్‌లు కూడా హైదరాబాద్‌ మీదనే దృష్టి పెడుతున్నారని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని మిగతా తొమ్మిది జిల్లాలను విస్మరిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకోగా వంద రోజుల టీఆర్‌ఎ స్‌ పాలన నిరాశపర్చిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వంపైనా ఇంత తొందరగా అసంతృప్తి ఏర్పడలేదన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలూ జరుగుతున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు, కౌ న్సిలర్‌ జీవీ.నరసింహారెడ్డి, పార్టీ మండల అ ధ్యక్షుడు కిశోర్‌రెడ్డి, యాదాగౌడ్‌, జక్కం లింగారెడ్డి, జితేందర్‌, సోం లింగారెడ్డి పాల్గొన్నారు.