Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:41AM

రుణమాఫీ నివేదికలు పకడ్బందీగా రూపొందించాలి : కలెక్టర్‌ రోస్‌


బీర్కూర్‌: అక్రమాలకు, నకిలీలకు తావు లే కుండా రుణమాఫీ నివేదికలు పకడ్బందీగా రూపొందించాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ ఆదేశించారు. బుధవారం బీర్కూ ర్‌ మండలంలో ఆయన పర్యటించారు. ముం దుగా తహసీల్దార్‌ కార్యాలయంలో రుణమాఫీ పై సమీక్షించారు. రికార్డులను పరిశీలించి, వి విధ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆయ న అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీపై తహసీల్దార్‌ ప్రసాద్‌, నోడల్‌ అధికారి గంగారెడ్డి, బ్యాంకర్ల నోడల్‌ అధికారి అప్పారావులతో గం టన్నర పాటు సమీక్షించారు. ఆధార్‌ సీడింగ్‌ ఎంత వరకు వచ్చిందని తెలుసుకున్నారు. అ నంతరం కలెక్టర్‌ విలేఖర్లతో మాట్లాడుతూ బీర్కూర్‌ మండలంలో ఇప్పటి వరకు 82శాతం ఆధార్‌ సీడింగ్‌ పూర్తయిందన్నారు. ‘సి’ ఫార్మాట్‌ ప్రకారం మండలంలో ఇప్పటి వరకు 23,246మంది రైతులకు రూ.95కోట్ల రుణమా ఫీ అవుతుందని తెలిపారు. అయితే వీరిలో న కిలీ పట్టాపాస్‌బుక్‌లు కలిగి ఉన్న వారిని, ఒక టి కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు పొందిన వారిని మినహాయిస్తే మండలంలో రూ.75 కోట్ల వరకు రుణమాఫీ అవుతుందని కలెక్టర్‌ అంచనా వేశారు. నకిలీలను గుర్తించి అసలైన రైతులకే రుణమాఫీ వర్తించే విధంగా చూస్తామని అన్నారు. ఆధార్‌ కార్డులు లేని వారికి రు ణమాఫీ వర్తిస్తుందా అని విలేకరులు అడుగ గా ప్రతీ ఒక్కరు ఆధార్‌ కార్డులను అందజేయాలని, లేని వారు మీ సేవ కేంద్రాల్లో ఆధా ర్‌ కోసం పేర్లు నమోదు చేసుకుని ఎన్రోల్‌మె ంట్‌ జిరాక్స్‌ కాపీలను అందజేయాలని సూచించారు. రేషన్‌ కార్డులతో సంబంధం లేకుండా బ్యాంకు అప్పు ఉన్న కుటుంబానికి రూ.లక్ష చొ ప్పున రుణమాఫీ వర్తింపజేస్తామని తెలిపారు. ఇక బంగారంపై రూరల్‌ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలనే లక్ష వరకు మాఫీ చేస్తామని, నిజామాబాద్‌ అర్బన్‌లో తీసుకున్న రుణాలకు మా ఫీ వర్తించదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. రుణ మాఫీ నివేదిక ఈ నెల 15వరకు పూర్తి చేస్తామని అన్నారు. రేషన్‌ లబ్ధిదారులు, రైతుల ఆ ధార్‌ కార్డు నెంబర్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని ఆయన అధికారుకు సూచించారు. అ నంతరం కలెక్టర్‌ బీర్కూర్‌లోని ఆంధ్రాబ్యాంక్‌, నసురుల్లాబాద్‌లోని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్రాం చ్‌లను సందర్శించి మేనేజర్లతో రుణమాఫీపై మాట్లాడారు. ఎంత మంది అర్హులను గుర్తించారు, ఆధార్‌ నెంబర్లు సేకరణపై వివరాలు అడిగారు. పూర్తి నివేదిక అందించాలని తెలిపారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో శ్యాంప్రసాద్‌లాల్‌, త హసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌ సత్యనారాయ ణ, మండల నోడల్‌ అధికారి, బ్యాంకర్స్‌ నోడల్‌ అధికారి, ఏవో కమల, అబ్దుల్‌ హకీం ఉన్నారు.