Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:41AM

విద్యార్థులకు నోట్‌ పుస్తకాల అందజేత

పాలకొల్లు అర్బన్‌ : స్థానిక మన్యం జగ్గమ్మగారి సత్రం సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పేద విద్యార్థులకు నోట్‌ పుస్తకా లు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. జగ్గమ్మగారి సత్రంలో బుధవారం జరిగిన కార్యక్రమం లో వివిధ పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు అందించారు. శా సన మండలి విప్‌ అంగర మాట్లాడుతూ ఆనాడు దాతలు సత్రాన్ని నెలకొల్పి విద్యార్థుల ను ప్రోత్సహించేలా మధ్యాహ్న భోజనాలు ఏ ర్పాటు చేయడం, నోట్‌ పుస్తకాలు అందిండం వంటి సేవా కార్యక్రమాలను ప్రారంభించారని, వాటిని కొనసాగిస్తుండటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణాధి కారి నామాల పైడియ్య, చైర్మన్‌ వి.నారాయణమూర్తి, వైస్‌ చైర్మన్‌ కార్నేన రోజా రమణి, గౌ రు నాయుడు, కౌన్సిలర్‌ జగ్గురౌతు రాంబాబు, సత్రం మాజీ చైర్మన్‌ కె.గోపాలకృష్ణ. ఎ.మోహన్‌దాస్‌, పి.వీరన్న, రావూరి సుందర్‌, చింతల సీత, టీ సత్యనారాయణరావు, జీవీ ఉన్నమ ట్ల కపర్ధి, ఎం.సత్యనారాయణ, నాళం బాబి, పాఠశాల ఉపాధ్యాయులు ఈవో వై.భద్రాజి, సత్రం సిబ్బంది పాల్గొన్నారు.