Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:40AM

సోలార్‌ విద్యుత్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి


ఖిల్లా: జిల్లా వాసులకు సోలార్‌ విద్యుత్‌ పై అవగాహన కల్పించి సోలార్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించాలని ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వెంకటనారాయణ అ న్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్‌ భవన్‌లో బుధవారం విద్యుత్‌ సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సి బ్బందికి పలు సూచనలు ఇచ్చారు. జిల్లాలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందనీ, ప్రస్తుతం వ్యవసాయానికి ఐదు గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామనీ, ఏడు గంటల విద్యుత్‌ ఇవ్వటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రైతుల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ లు చెడిపోతే 48 గంటల్లో వారికి బాగుచేసి ఇవ్వాలని సూచించారు. విద్యుత్‌ ఓవర్‌లోడ్‌ ఉ న్న చోట్ల కేపాసిటర్‌లు పెట్టించాలనీ, కెపాసిట ర్‌ వల్ల ఉపయోగాలను రైతులకు వివరించాల న్నారు. కెపాసిటర్లు వాడడం వల్ల పవర్‌ సప్లై సక్రమంగా జరుగుతుందని ఐఎస్‌ఐ మార్కు ఉన్న మోటారు పంపులనే రైతులు ఉపయోగించాలని సూచించారు. విద్యుత్‌ సరఫరా స క్రమంగా చేస్తున్నామనీ, బిల్లులు ఎందుకు వసూలు చేయడం లేదని అధికారులను ప్ర శ్నించారు. ఎక్కువ మొత్తంలో బిల్లులు బకాయిలు ఉన్న వారి పవర్‌ కనెక్షన్‌ కట్‌ చేయాలని సూచించారు. నగరంలో హోటల్స్‌, హాస్పిటల్స్‌, కళాశాలలు లాంటి పెద్దపెద్ద సంస్థల్లో సోలార్‌ సిస్టమ్‌ ద్వారా విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించాలని, ఇందుకు ప్రభుత్వం 70 శా తం సబ్సిడీ ఇస్తుందని, వినియోగదారుడు 30 శాతం ఖర్చు చేసుకుంటే ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ పథకాన్ని అందరికీ వివరించాలని సూచించారు. జిల్లాలో మరో 17 33/11 కేవీ సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని వీటిని వచ్చే మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ఈనెలలో బిల్లులు వంద శాతం వ సూలు చేయాలనీ, పెండింగ్‌ బిల్లులపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ ప్రభాకర్‌, డైరెక్టర్లు చంద్రశేఖర్‌, వెంకటేశ్వర్‌రావు, సుధాకర్‌తో పాటు ఏఈలు, ఏడీఈ, అసిస్టెంట్‌ ఆఫీసర్లు, విజిలెన్స్‌ పోలీసులు పాల్గొన్నారు.టఉగిజుూురో8జూఇర