Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:37AM

మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి

పాయకరావుపేట : మహిళలల్లో ఆర్థిక స్వావలంబనకు కృషిచేస్తున్నట్టు నాబార్డ్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ కె.వి.ఎస్‌,ఎస్‌.ఎల్‌.వి.ప్రసాదరావు తెలిపారు. బుధవారం గ్రామ స్వరాజ్య సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అడ్వాన్స్‌డ్‌ టైలరింగ్‌ కోర్స్‌ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేద మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళపై తాము నిలబదేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు ఎంతో దోహదపడతాయన్నారు. సర్పంచ్‌ ధనిశెట్టి నాగమణి మాట్లాడుతూ అడ్వాన్స్‌డ్‌ టైలరింగ్‌ శిక్షణా తరగతులను మహిళలు సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవాలన్నారు. జీఎస్‌ఎస్‌ కార్యదర్శి బద్ది రాము మాట్లాడుతూ, 60 మంది మహిళలకు రెండు విడతలుగా 13 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండురంగస్వామి దేవస్థానం మాజీ చైర్మన్‌ ధనిశెట్టి బాబూరావు, ఏపీజీవీ బ్యాంక్‌ మేనేజరు కె.నాగేశ్వరరావు, టి.రమణముర్తి, వార్డు సభ్యులు పెంకే శ్రీను, దొంగల శ్రీను పాల్గొన్నారు.