Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:34AM

విద్య, వైద్యం, తాగునీటిపై దృష్టి సారించాలి


త్రిపురారం : విద్య,వైద్యం, తాగునీటి వనరులపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని జడ్పీసీఈవో దామోదర్‌రెడ్డి కోరారు. మండల కేంద్రంలోని మండలపరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు హాజరుశాతం, విద్యాభివృద్ధి, సౌకర్యాల మెరుగు పరచడంలో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని సూచించారు. గ్రామాల్లో సరఫరా చేసే తాగునీరు ఎక్కువగా వృథా అవుతుందన్నారు. దీంతో విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని, దోమల బెడద అధికమవుతుందన్నారు. తాగునీటిని పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 33ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి ప్రతిమూడు పాఠశాలకు ఒక ప్రత్యేకాధికారిని కలెక్టర్‌ నియమించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమావేశమయ్యారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను సందర్శించారు. ఆయన వెంట ఎంపీపీ దూళిపాలు ధనలక్ష్మి, ఎంపీడీవో రమేష్‌, సూపరిండెంట్‌ ఇందిర, శ్రీనివాస్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు
నిడమనూరు : అన్నిప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని జిల్లా పరిషత్‌ సీఈవో దామోదర్‌రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల(మోడల్‌ స్కూల్‌)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి.. మెనూను తప్పకుండా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇంగ్లీషులో వకాబులరీని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాల భవనం నాణ్యతను పరిశీలించి భవనానికి పగుళ్లు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నిడమనూరులో ఏర్పాటు చేయనున్న మున్సిఫ్‌ కోర్టు నిర్వహణకు కేటాయించనున్న మండల కాంప్లెక్స్‌ భవనాన్ని పరిశీలించారు. భవనాన్ని కోర్టు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు తీర్మానం చేయాలని ఎంపీపీకి సూచించారు. ఆయన వెంట ఎంపీపీ దాసరి నర్సింహ, జడ్పీటీసీ సభ్యురాలు అంకతి రుక్మిణిసత్యం, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, ఎంపీడీవో ప్రతాప్‌నాయక్‌, ఎంఈవో రవినాయక్‌, మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రంజిత, పీఆర్‌ ఏఈ యాదగిరాచారి, స్థానిక సర్పంచ్‌ రుద్రాక్షి ముత్తయ్య, మేరెడ్డి వెంకటరమణ ఉన్నారు.రో(2ఇ