Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:32AM

ఇచ్చిన హామీలు నెరవేర్చని సీఎం : సీపీఎం


తుంగతుర్తి : సీఎం కేసీఆర్‌ ఇచ్చి న హామీలను కార్యాచరణలో అమ లు చేయడం లేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముల్కలపల్లి రాములు విమర్శించారు. బుధవారం తుంగతుర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించి వందరోజులు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని విమర్శించారు. దళితుల కు మూడుఎకరాల భూమి ఇవ్వాల న్నారు. సింగపూర్‌ వెళ్లిన కేసీఆర్‌ అక్కడి పారిశ్రామికవేత్తలకు ఐదు లక్ష ల ఎకరాల భూమి ఉందని చెప్పార ని, ఇక్కడి పేదలకు మాత్రం భూమి ఇవ్వడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత లేకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌ ఆందోళనకరం గా మారిందన్నారు. విద్యాశాఖ మం త్రి ఈప్రాంతానికి చెందినవారు అయినందున ఇక్కడ ప్రభుత్వ జూ నియర్‌, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు. ప్రభుత్వం పత్రికాస్వేచ్ఛపై చేస్తున్న దాడిని విడనాడి తెలంగాణలో వెంటనే ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రసారాలు పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. మూరగుండ్ల లక్ష్మయ్య, బి.యాదగిరి, జి.పద్మ, సత్యం, బి.శ్రీనివాస్‌, చంద్రమౌళి, లింగయ్య పాల్గొన్నారు.