Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:32AM

దిగజారుతున్న పత్తి ధర

తర్లుపాడు: తెల్లబంగారంగా పేరుగాంచిన పత్తి పంటకు గిట్టుబాటు ధర లేక ఈ ఏడాది రైతులు దగా పడ్డారు. పెట్టుబడులు పెరిగినా ధరలు మాత్రం రోజు రోజుకు దిగజారడం పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. గత ఏడాది క్వింటా రూ. 5 వేలు ఉండగా, ప్రస్తుతం పత్తి క్వింటా 4 వేల 250 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది వేసవి కాలంలో వ్యవసాయ బోర్ల కింద 500 హెక్టార్లలో పత్తి పంటలను సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. గత ఏడాది ఎకరాకు 15 నుంచి 18 క్వింటాళ్ళు దిగుబడి రాగా ప్రస్తుతం 6, 7 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు. పత్తి పైరుకు ఎండు తెగుళ్ళు సోకాయి. పైరును కాపాడుకునేందుకు రైతులు వేలాది రూపాయలు వెచ్చించి క్రిమి సంహారక మందులు పిచికారి చేశారు. ఎకరాకు సుమారు రూ. 35 వెేలు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఎకరాకు 7 క్వింటాళ్ళు దిగుబడి వచ్చినా 5 వేల 250 రూపాయలు నష్టాన్ని సవి చూడాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి తర్లుపాడుకు రైతులు వచ్చి పొలంను కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేశారు. ఎకరా కౌలు రూ. 6 వేల చొప్పున ముందుగా చెల్లించి పత్తి పంటను సాగు చేశారు. కౌలు రైతులకు కన్నీళ్లే మిగులుతాయి. ఎకరా సాగు చేసిన కౌలు రైతుకు దాదాపుగా 11 వేల రూపాయలు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
మార్కెట్‌ వసతి కరువు
మార్కాపురం డివిజన్‌లో పత్తికి మార్కెట్‌ వసతి లేకపోవడంతో ఇక్కడ పండించిన పత్తి పంటను గ్రామాల్లోని వ్యాపారస్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పత్తిని క్వింటా 4,200 రూపాయల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. కాటా వేసేటప్పుడు దళారులు మాయాజాలం చేసి క్వింటాకు 5 కేజీల చొప్పున అదనంగా దోచుకుంటున్నారని రైతు లు వాపోతున్నారు. పొలాల్లో జాగా రం చేసి పంటను పండించుకున్న గిట్టుబాటు ధర లేకపోవడంతో పత్తి ని ఎక్కడ నిల్వ చేసుకోవాలో అర్థం కావటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు నాణ్యత ఉన్న పత్తిని కూడా బాగాలేదని సాకులు చెప్తూ రైతులు దివాల తీయిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఎన్నిసార్లు ప్రభుత్వం రుణ మాఫీలు చేసినా దళారుల దోపిడి నుంచి రైతు ను కాపాడాలేకపోతే ఇక వారు పంటలవైపు దృష్టి సారించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి
ఈర్ల పెద్ద కాశయ్య, పత్తి రైతు
ప్రస్తుతం పత్తి క్వింటా 4,200 రూపాయలకు మాత్రమే దళారులు కొనుగోలు చేస్తున్నారు. పెరిగిన పెట్టుబడులు, కూలీ రేట్ల దృష్ట్యా మద్దతు ధరను రూ. 5 వేలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.