Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:32AM

కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిరసన


మోత్కూరు : సీఎం కేసీఆర్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ చేసిన ప్రకటనపై నిరసన వ్యక్తం చేస్తూ ప్రైవేట్‌ లెక్చరర్లు, నిరుద్యోగులు బుధవారం మోత్కూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల తరగతులను బహిష్కరించారు. క్రమబద్ధీకరించాలన్న ఆలోచనను ఉపసంహరించుకోవాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమంలో పాల్గొంటే ఇప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండా కాంట్రాక్ట్‌ ఉద్యోగులనే క్రమబద్ధీకరిస్తామనడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆ ఆలోచనను ఉపసంహరించుకుని ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రైవేట్‌ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు జె.లింగయ్య, నాయకులు కె.మాధవరెడ్డి, బాసాని రాములు, వి.యాకూబ్‌రెడ్డి, బి.యాకస్వామి, కె.యాకేష్‌, కె.నర్సింహ, బి.నవీన్‌, ఎ.నర్సింహ, ఎల్‌.సురేష్‌, ఎం.రవీందర్‌, బి.ఆంజనేయులు, పి.లక్ష్మయ్య, పి.సురేష్‌, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు కె.రమేష్‌, కె.దాసు, ఎం.సురేష్‌, హరీష్‌, మహేష్‌ పాల్గొన్నారు.
తుంగతుర్తిలో...కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తే నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదముందని ప్రైవేట్‌ లెక్చరర్స్‌ సంఘం అధ్యక్షుడు సలీం అన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణను వ్యతిరేకిస్తూ తుంగతుర్తి లో విద్యాసంస్థల బంద్‌ నిర్వహించి, అనంతరం మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు రవి, సైదులు, లింగారెడ్డి, రాములు, ఓంకార్‌, మహేష్‌, రాంమూర్తి, రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.
తిరుమలగిరిలో... కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిరసనగా మండల కేంద్రంలో ప్రైవేట్‌ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో కళాశాలల బంద్‌ నిర్వహించి, సూర్యాపేట- జనగాం రోడ్డుపై రాస్తారోకో జరిపారు. కార్యక్రమంలో కరుణాకర్‌, లింగయ్య, పాలబిందెల శేఖర్‌, మధూకర్‌, పి.కంఠ్లం తదితరులు పాల్గొన్నారు.
అర్వపల్లి : కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిరుద్యోగు లు, అధ్యాపకులు విద్యాసంస్థలను బంద్‌ జరిపారు. ఈ సందర్బంగా అధ్యాపక బృందం నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎంతో ఆశతో ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించుకున్న నిరుద్యోగులకు కేసీఆర్‌ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని విమర్శించారు. కార్యక్రమం లో సతీష్‌, శ్రీనివాస్‌, దేవయ్య, వెంకన్న, వెంకటేశ్వర్లు, రమేష్‌, రవి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
శాలిగౌరారం : కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా శాలిగౌరారంలో నిరుద్యోగుల ఆధ్వర్యం లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల బంద్‌ చేపట్టారు. కార్యక్రమంలో బండారు రఘు, నిమ్మల శంకర్‌, ఎన్‌.నరేష్‌ తదితరులు పాల్గొన్నారు. ్ఠ్జ్ఛఇఠీరోఇ్ట