Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:32AM

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

కురిచేడు: జిల్లా వెద్య ఆరోగ్యశాఖాధికారి కె. చంద్రయ్య బుధవారం మధ్యాహ్నం కురిచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వైద్యశాల సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పీహెచ్‌సీలో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని దానిని కౌన్సిలింగ్‌లో సరిచేస్తానన్నారు. కురిచేడు పీహెచ్‌సీలో కాన్పులు కూడా చేయడం లేదని జడ్పీటీసీ సభ్యుడు కేసనపల్లి పిచ్చయ్య, జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్ళారు. ఈ విషయంలో వైద్యశాల సి బ్బందిపై వైద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్‌ నర్స్‌, సిబ్బంది సక్రమంగా ఉండటం లేదని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు గడ్డం బాలయ్య యాదవ్‌, సింగి ల్‌విండో అధ్య క్షుడు కమతం నాగిరెడ్డి ఫిర్యా దు చేశారు. ముగ్గురు స్టాఫ్‌ నర్సులు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారని సర్దుకు పోవాలని ఆయన అన్నారు. కాన్పుల కోసం పీహెచ్‌సీకి రావాలని పైసా ఖర్చులేకుండా కాన్పులు చే యించుకోవచ్చని తెలిపారు. వైద్యశాలలో కాన్పు జరిగితే రూ.1008 ఇస్తామని, భోజనం బిల్లులు కూడా చెల్లిస్తామన్నారు. వైద్యశాల ఆవరణలో మొక్కలు నాటాలని, రోగులు కూర్చోవడానికి కుర్చీ లు కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. పరిసరాలను ప రిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో దర్శి క్లస్టర్‌ డీసీఏవో సుబ్బారెడ్డి, డాక్టర్‌ సుమిత పాల్గొన్నారు.
ముండ్లమూరులో..
ముండ్లమూరు: మండలంలోని మారెళ్ళ,ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కె. చంద్రయ్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మారెళ్ళ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంను సందర్శించారు. ఆ సమయంలో రోగులు వై ద్యాధికారి వద్ద చికిత్సలు చేయించుకుంటున్నారు. అక్కడి వైద్యలను అభినందించారు. వార్డులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ముండ్లమూరు ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. ఓపీ రిజిస్టర్‌లో మధ్యాహ్నం 12 గంటలవరకు 50 మందికి చికిత్స చేసినట్లు గుర్తించారు. అనంతరం వైద్యులు జి. శైలేంద్రకుమార్‌, శశికాంత్‌లతో కలిసి మందుల స్టోర్‌రూం, వార్డులు పరిశీలించారు. వైద్యశాల రిజిస్టర లను నినశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ముండ్లమూరు వైద్యశాల పనితీరు సంతృప్తినిచ్చిందని అన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు అబ్ధుల్‌సత్తార్‌, బాలస్వామి, తిరుమలరావు, యోగయ్య పాల్గొన్నారు.