Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:22AM

గోల్డ్‌ కవరింగ్‌ నగలు విదేశాలకు ఎగుమతి

మచిలీపట్నం-ఈడేపల్లి : గోల్డ్‌ కవరింగ్‌ నగలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని గోల్డ్‌ ప్రిన్స్‌ అధినేత, జ్యూయలరీ పార్కు కమిటీ ఉపాధ్యక్షుడు చలమలశెట్టి నరసింహారావు పేర్కొన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా అవనిగడ్డ మండలి వెంకట కృష్ణారావు డీఈడీ కళాశాల విద్యార్థులు స్థానిక నరసింహనగర్‌లోని గోల్డ్‌ ప్రిన్స్‌ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గోల్డు కవరింగ్‌ నగల చారిత్రక నేపథ్యాన్ని నరసింహారావు వివరించారు. 150 ఏళ్ళ క్రితం టేకి నరసింహారావు తయారు చేసిన కట్టు నగలు నేడు గోల్డ్‌ కవరింగ్‌ నగలుగా రూపాంతం చెందాయన్నారు. మహిళల అభిరుచులకు అనుగుణంగా సరసమైన ధరలకు ఆభరణాలను తయారు చేస్తున్నామన్నారు. చైనా ఆభరణాలకు దీటుగా బందరులో రోల్డుగోల్డ్‌ పరిశ్రమల్లో ఆభరణాలు తయారు చేస్తున్నామన్నారు. రానున్న దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని అమ్మవారికి అలంకరించే ఆభరణాలను రూపొందిస్తున్నామన్నారు. ఈ పరిశ్రమపై 60 వేల మంది జీవిస్తున్నారన్నారు. గుడిసేవ విష్ణుప్రసాద్‌ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు మంగినపూడి బీచ్‌, తరంగిణీ మాతదేవాలయం, దత్త రామేశ్వరం ప్రాంతాలను సందర్శించారు.