Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:21AM

విద్యార్థులపై దాడి చేసిన నలుగురి అరెస్టుఆటోనగర్‌: కారు అద్దానికి చేయి తగిలిందనే చిన్న కారణంతో నలుగురు విద్యార్థులను చితక్కొట్టి గాయపరిచిన నలుగురు నిందితులను పటమట పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 31వ తేదీన పామర్తి మహేష్‌ (23) అతని ముగురు స్నేహితులు నడుచుకుండా హైస్కూల్‌ రోడ్డు జంక్షన్‌ నుంచి రైతు బజార్‌ వైపు వస్తుండగా ఆటోనగర్‌గేటు నుంచి పటమట వైపు వచ్చిన కారు అద్దానికి వారి చేయి తగిలింది. దీంతో కారులో ఉన్న వారు కిందకు దిగి మహేష్‌ అతని స్నేహితులను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ ఘటనలో మహేష్‌కు కన్ను మీద గాయం కాగా, మరొకతనికి స్పల్పగాయాలయ్యాయి. విద్యార్థులు తమపై దాడి చేసి బంగారు గొలుసులు తెంపుకుని వెళ్లారని ఆ వ్యక్తులు తప్పుడు ఫిర్యాదు చేశారు. బాధితులు కూడా ఫిర్యాదు చేసినా ఆ రోజు స్టేషన్‌లో సిబ్బంది సరిగా స్పందించలేదు. చివరకు ఇరువర్గాల ఫిర్యాదులు తీసుకున్న ఎస్సై జనార్ధన్‌ విచారణ చేసి కారులో ఉన్న అనిల్‌కుమార్‌, యలమంచిలి శివరామ్‌, దామర సూరిబాబు, వడ్లమూడి హరికృష్ణలదే తప్పు అని తేల్చారు.
కానీ నిందితులను అరెస్టు చేయడంలో జాప్యం చేసిన పోలీసులు , స్టేట్‌మెంట్‌లు నమోదు చేయాలని బాధితులను రమ్మనమని కానిస్టేబుల్‌ ఒకరు దురుసుగా వ్యహరించడం జరిగింది. ఈ వ్యవహారం చివరకు రచ్చకెక్కటంతో పోలీసులు నిందితులు నలుగురిని అరెస్టు చేశారు.