Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:21AM

‘ఉపాధి’ కల్పనలో పూర్‌


మహబూబ్‌నగర్‌ అర్బన్‌: వలసలు నివారించి, ఉన్నచోటే పనులు కల్పించాలని ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం లక్ష్యం నీరుగారుతోంది. క్షేత్రస్థాయి సిబ్బం ది పనితీరు మెరుగుపడక పోవడంతో పథకం అమలు నత్తనడకన సాగుతోంది. సిబ్బందికి కే టాయించిన లక్ష్యాలు చేరుకోకపోవడంతో వా రిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఏపీఓలు, క్షేత్రసహాయకులపై ఒకటి రెండు రోజుల్లో చ ర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. గురువారం హైదరాబాద్‌లో జరిగే ప్రాజెక్టు డైరెక్టర్ల సమా వేశంలో చర్యలకు ఆదేశాలు జారీ చేసే అవకా శం ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్యాలను చేరుకొని జాబితాలో 29 మంది ఏపీఓలు, 79 మంది క్షేత సహాయకులు ఉన్నారు.
29 మంది ఏపీఓలపై చర్యలు?
ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 55 మం ది ఏపీఓలు పని చేస్తున్నారు. అందులో 29 మంది లక్ష్యాలకు దూరంగా ఉన్నారు. ఏడాది లో అంటే జూన్‌ 30 నుంచి జూలై 31 వరకు ఏపీఓ పరిధిలో ఉన్న మండలంలో లేబర్‌కు కే టాయించిన బడ్జెట్‌లో 75 శాతంనిధులు ఖర్చు చేయాలి.అన్నినిధులు ఖర్చుచేయలేని వారు ప్రస్తుతం 29 మంది ఉన్నారు.వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న ఉత్కంఠ నెలకొం ది. ఒక వేళ కమిషనర్‌ 50 శాతంకు త గ్గిస్తే జాబితాలో ఆరుగురే మిగిలే అవకాశం ఉంది.
క్షేత్ర సహాయకులకు రెన్యూవల్‌ కష్టాలు
లక్ష్యాలను చేరుకొని క్షేత్రసహాయకుల కాంట్రాక్ట్‌ను రెన్యూవల్‌ చేయని పరిస్థితి నెలకొంది. ప్రతిక్షేత్ర సహాయకుడు తన గ్రామంలో ఏడాదికి 7,500 పని దినాలు కల్పించాలి. అందులో కనీసం 5వేల పనిదినాలైనా చేయగలగాలి. వీటితో పాటు కూలీల ఆధార్‌ నెంబర్లు ఎన్‌రోల్‌ చేయాల్సి ఉంటుంది. ప్రతి గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్ల పనులను ప్రారంభించ గలగాలి. ఈ లక్ష్యాలను చేరుకోని 79 మంది క్షేత్ర సహాయకుల కాంట్రాక్ట్‌ ఈ ఏడాదికి రెన్యూవల్‌ నిలిచిపోయింది. కాంట్రాక్ట్‌ రెన్యూవల్‌ కాకపోతె వారంతా సీనియరేట్లుగా మారతారు. అంటే క్షేత్రసహాయకులకు నెలకు రూ.5,400 వేతనం వస్తుండగా సీనియరేట్లుగా మారితే రూ.2,000లకు పడిపోతుంది.ట్చఛి రోజూఇ్ఝ