Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:20AM

ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలి


మహబూబ్‌నగర్‌ టౌన్‌: చాకలి ఐలమ్మ విగ్రహాన్ని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని, ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చే ర్చాలని తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం నేతలు కోరారు. ఆ సంఘం జిల్లా కార్యాలయం లో బుధవారం వీరనారి చాకలి ఐలమ్మ 28వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలల వేసి నివాళులర్పించారు. భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, భూమి కోసం పో రాటం చేసింది ఐలమ్మ అని కొనియాడారు. కా ర్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.వెంకట య్య, జంగయ్య, భాస్కర్‌, లింగం, సత్యం, యా దయ్యమెట్ట, పెద్దయాదయ్య, నాగరాజు, శివరాములు, రజక సంఘం జిల్లాధ్యక్షుడు అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో..
చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్‌ ప ర్సన్‌ రాధాఅమర్‌ మాట్లాడుతూ తెలంగాణసా యుధ పోరాటంలో ఐలమ్మ విరోచితంగా పో రాడిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఆమె చేసిన సేవలు ఎన్నటికీ మరిచి పోరాన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ కె.రాములు, టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ కృష్ణమోహన్‌, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ము త్యాల ప్రకాష్‌, నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, గౌలివీరు, అమ రేందర్‌రాజు, టీఎన్జీఓ జిల్లా అధ్య క్షుడు రాజేందర్‌రెడ్డి, రజక అభివృద్ధి సంస్థ జి ల్లా అధ్యక్షుడు పురుషోత్తం, నాయకులు రవి, గొర్ల కాపర్ల సంఘం, రజక ఉద్యోగుల సంఘం, మహేంద్ర సంఘాల అధ్యక్షులు లక్ష్మణ్‌, కోట య్య, రాములు తదితరులు పాల్గొన్నారు.=)రోఆ2