Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:20AM

రూ. కోటి 30 లక్షల ధాన్యం మాయం

ముదినేపల్లి: పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం ఽ గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామానికి చెందిన అలీవ్‌ నాలుగేళ్ల క్రితం పెదకామనపూడిలో రైస్‌మిల్లు నిర్మించాడు. రెండేళ్ల క్రితం విజయవాడ యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచి నుంచి సుమారు రూ. 3 కోట్లకు పైగా ధాన్యం నిల్వలు తనఖాగా ఉంచి రూ. 2 కోట్లు రుణం తీసుకున్నాడు. ఇందుకు ముంభై ప్రధాన కేంద్రంగా ఉన్న స్టార్‌ అగ్రివేర్‌ హౌసింగ్‌ కొల్లేటరల్‌ మేనేజిమెంట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ బ్యాంకుకు రైస్‌మిల్లు యాజమాన్యానికి అనుసంధానంగా ఉంది. కొంత కాలం పాటు ఆ బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణంలో 30 శాతం చెల్లించినట్లు తెలిసింది. ఎప్పటికప్పుడు బ్యాంక్‌ ప్రతినిధులు గోడౌన్‌లోని ధాన్యం నిల్వలను పరిశీలించడం కూడా జరుగుతూనే ఉంది. రైస్‌మిల్‌ తమకు అందుబాటులో ఉండటంలో ముదినేపల్లి మండలంలోని పలు గ్రామాల రైతులు, పెడన, మచిలీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన ధాన్యం వ్యాపారస్తులు, రైతులు అలీమ్‌తో తమకు ఉన్న పరిచయాల బట్టి ఈ మిల్లులో లక్షలాది రూపాయిల ధాన్యాన్ని నిల్వ ఉంచారు. ఈనెల 6వ తేదీ రాత్రి గోడౌన్‌లోని మొత్తం ధాన్యం నిల్వలు మాయమైనట్లు రైతులకు తెలిసి ఏడో తేదీ ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు నుంచి దర్యాప్తు ప్రారంభించారు. అంతకు ముందు రెండు రోజలు క్రితమే రుణం ఇచ్చిన యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారుల బృందం గోడౌన్‌ను పరిశీలించి సుమారు నాలుగు వేల బస్తాల తేడాతో మిగిలిన ధాన్యం నిల్వలు ఉన్నట్లు రికార్డు చేసినట్లు తెలిసింది. గోడౌన్‌లో ధాన్యం నిల్వలు లేకపోవడం, మిల్లు యజమాని కనిపించకపోవడంతో వివిధ ప్రాంతాలకు చెందిన 14 మంది రైతులు ముదినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో తమకు లక్షలాది రూపాయిల సొమ్ములు మిల్లు యజమాని నుంచి రావాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు మిల్లు యజమానిపై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై వి. సతీష్‌ తెలిపారు. ఽఈ ఫిర్యాదుల ప్రకారం రైతులకు సుమారు రూ. 40 లక్షలు సొమ్ము మిల్లు యజమాని చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించామని ఎస్సై చెప్పారు. ధాన్యం నిల్వలు రాత్రికి రాత్రే ఎలా మాయమైయ్యాయన్న విషయంపై అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.