Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:20AM

తెలంగాణ పోరాట యోధుల చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలి


మహబూబ్‌నగర్‌ విద్యా విభాగం: తెలం గాణ సాయుధ పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడిన యోధుల చరి త్రను పాఠ్యాంశాలుగా చేర్చి తెలంగాణ చరిత్ర ను విద్యార్థులకు తెలియజెప్పాలని పాలమూ రు వర్సిటీ ఇన్‌చార్జి రిజిస్టార్‌ డాక్టర్‌ గూడురు మనోజ అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పోరాడిన చాకలి ఐలమ్మ వర్ధంతిని బు ధవారం పాలమూరు వర్సిటీలో పీజీ కళాశాల సెమినార్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మనోజ హాజరై మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో రజకర్ల దేశ్‌ముఖ్‌ల ఆగడాలను ఎదురించి పోరాడిన వనిత చా కలి ఐలమ్మ అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వారందరి జయంతి, వర్ధతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమండ్‌ చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ వంగరి భూమయ్య, డాక్టర్‌ నూర్జహాన్‌, గా లెన్న, అర్జున్‌, సురేష్‌, రంగప్ప, డాక్టర్‌ సోమేశ్వర్‌, వాసవి మృదుల, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్‌టౌన్‌: వెట్టిచాకిరి విము క్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వ ర్ధంతిని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ రచన సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయశా ఖ రజక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సీ.లింగం ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అం జనేయులు, నర్సింహ్మ, యాదయ్య, వెంకట య్య, శివ, భాస్కర్‌, గోపి, ఖాజా, చిన్న యాదయ్య, శ్రీను పాల్గొన్నారు.
న్యూటౌన్‌: చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మరో పోరాటానికి సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి.జబ్బార్‌ సూచించారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని సీపీఎం కార్యాలయంలో ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో సీపీఎం నాయకులు రఘు, టౌన్‌ కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి, పర్వతాలు, చంద్రకాంత్‌, బాల్‌రెడ్డి, అనురాధ, రాము, వంశీ, విప్లవ, తదితరులు పాల్గొన్నారు. మ్మం5రోఛఇ