Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:19AM

ఇళ్లు, వ్యాపార భవనాలపై ఆడిట్‌ అధికారుల విచారణ


గద్వాల : మున్సిపాలిటీలోని ఇళ్ల, వ్యాపార సముదాయ భవనాల ద్వారా వచ్చే పన్ను విషయంలో అవకతవకలు జరిగాయన్న కారణంపై తెలంగాణలోని అన్ని పాత మున్సిపాలిటీల్లో బుధవారం నుంచి పరిశీలన మొదలయింది. మహబూబ్‌్‌నగర్‌ జిల్లాలోని గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో పరిశీలన ప్రారంభమయింది. రెండు నెలల క్రితం కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను లెక్కల్లో దాదాపు రూ. కోటి 5లక్షలు ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టించారని ఆడిట్‌లో తేలింది. దీంతో నంద్యాల మున్సిపాలిటీ లో 14మందిని సస్పెండ్‌ చేశారు. ఇది దృష్టిలో ఉంచుకుని తెలంగాణలోని ఇది వరకు పాత మున్సిపాలిటీలో విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఇందులో భాగంగా ఆడిట్‌ అధికారులు మున్సిపాలిటీ కార్యాలయాలలో సమాచారం సేకరించారు.
ఒక్క మున్సిపాలిటీలో 100 వంద చొప్పున ప్రతి మున్సిపాలిటీలో ఇళ్లను, వ్యాపార సముదాయాలను కలిపి 100దాకా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కమిషనర్‌ మున్సిపల్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి ఆడిట్‌ అధికారులను నియమించారు.
ఆడిట్‌ అధికారులపై విమర్శలు వెల్లువ :
స్థానికంగా పనిచేస్తున్న వారు కాకుండా ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. జిల్లా మొత్తంగా చూస్తే కేవలం గద్వాలలో మాత్రం ఇక్కడే కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఆడిట్‌ అధికారులనే మళ్లీ ఈ పరిశీలనలో విధులు నిర్వర్తించేలా చేశారు. ఇందులో ఒకరు సహాయ ఆడిట్‌ అధికారి శుక్రవర్దన్‌రెడ్డి ముగ్గురు సీనియరు ఆడిటర్లు పర్విన్‌, చెన్నారెడ్డి, వె ంకటేశ్వర్లు ఉన్నారు. అలాగే మున్సిపాలిటీల్లో కూడా శుక్రవర్దన్‌రెడ్డి నేతృత్వంలో ఆడిట్‌ జరిగినా, మళ్లీ వారు చేసిన దానిపై ప్రత్యేక ఆడిట్‌ చేశారు. జిల్లా ఆడిట్‌ అధికారుల సంఘంలో నాయకులుగా ఉన్న వీరు ఒత్తిడితో ఇక్కడకు వచ్చారన్న విమర్శలు ఉన్నాయి. వీరి స్థానంలో వేరే అధికారులను నియమించాలని పలువురు కోరుతున్నారు.
నాయకులకు చేరిన సమాచారం :
ఆడిట్‌ అధికారులు వచ్చారన్న సమాచారం అంతా రాజకీయ ప్రముఖులకు తెలిసిపోయింది. వారిని కాకా పట్టేందుకు ప్రయత్నించారు. ఆడిట్‌ అధికారులు వచ్చే సరికి ఆర్‌ఐ, సిబ్బంది తడపడటం కనిపించింది.
జిల్లా అధికారిని పంపిస్తా :
ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని పాత మున్సిపాలిటీల్లో ఈపరిశీలన సాగుతుంది. ఆడిట్‌ అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలన చేయాల్సి ఉంటుంది.
వారు చేసిన పరిశీలనపై మళ్లీ పరిశీలన జరిపిస్తాం. గద్వాలలోని ఆడిట్‌ అధికారులపై ఆరోపణలున్నాయి. కనుక జిల్లా అడిట్‌ అధికారిని పంపిస్తాను. నేను కూడా కొన్ని జిల్లాలకు రావాలని అనుకున్నాను.