Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:18AM

ప్రజాప్రతినిధులపై అంగన్‌వాడీ కార్యకర్త అసహనం

నాగాయలంక : ప్రజాప్రతినిధులన్నా గౌరవం లేకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని వారు అడిగిన ప్రశ్నలకు అంగన్‌వాడీ కార్యకర్త బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చిన ఘటన పెద ఏటిమొగ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగింది. బుధవారం మండలంలోని పెద ఏటిమొగ అంగన్‌వాడీ కేంద్రాన్ని ఎంపీపీ సజ్జా గోపాలకృష్ణ, జడ్పీటీసీ కన్నా నాగరాజులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో కార్యకర్త లంకే పాములమ్మ, 14 మంది పిల్లలు ఉన్నారు. ఆయా ట్రైనింగ్‌లో ఉంది. రికార్డులను పరిశీలించాక కేంద్రానికి ఎంత మంది పిల్లలు వస్తున్నారు. బాలింతలు, గర్భిణులు ఎంత మంది వస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆమెను ప్రశ్నించారు. ప్రతీ రోజూ పదిహేను మంది పిల్లలు, బాలింతలు, గర్భిణులు 20 మంది వస్తున్నారని చెప్పింది. వారందరికీ వంట చేశారా అని ఎంపీపీ, జడ్పీటీసీ అడుగగా, ఆమె చేశానని చెప్పింది. ఏదీ చూపించండి అంటూ వంటగదిలోకి కార్యకర్తతోపాటు ప్రజాప్రతినిధులు వెళ్ళి చూశారు. రెండు చిన్నపాత్రల్లో వండిన అన్నం, కూర ఉంది. పిల్లలు, బాలింతలు, గర్భిణులు దాదాపు 30 మందిపైనే ఉంటే వారికి ఈ ఆహారం ఎలా సరిపోతుందని వారు అడిగారు. దీంతో కార్యకర్త అసహనం వ్యక్తం చేస్తూ అవసరమైతే మళ్ళీ వండుతానని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. కార్యకర్త వైఖరితో ప్రజాప్రతినిధులు ఏటిమొగ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ సలీమున్నీసా, ఐసీడీఎస్‌ సీడీిపీవో జయలక్ష్మీతో ఫోనులో మాట్లాడారు. ఏటిమొగ అంగన్‌వాడీ కార్యకర్త పాములమ్మ పనితీరు ఏం బాగోలేదని, ఆమెపై చర్య తీసుకోవాలని, లేకుంటే ఈ విషయాన్ని పీడీ, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామని ప్రజాప్రతినిధులు చెప్పారు.
అంగన్‌వాడీ కేంద్రాలపై
పర్యవేక్షణ ఏదీ?
కోడూరు : బాలింతలకు, గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించటానికి రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన కార్యకర్తలు, ఆయాలు సక్రమంగా విధులు నిర్వహించకుండా కార్యకర్తలకు ఆటంకం కలిగిస్తున్నా అధికారులు మాత్రం పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని జడ్పీటీసీ సభ్యులు బండే శ్రీనివాసరావు, ఎంపీపీ మాచర్ల భీమయ్య అసంతృప్తిని వ్యక్తం చేశారు. బుధవారం కోడూరు శివారు మెరకగౌడపాలెం, వేటపాలెం గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. వేటపాలెం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి తాళాలు వేసి ఉండటంతో అసంతృప్తికి లోనయ్యరు.