Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:18AM

సంకెళ్లు ఇంకెనాళ్లు


మహబూబ్‌నగర్‌ టౌన్‌/నాగర్‌కర్నూల్‌ /వనపర్తి: రాష్ట్రంలో ఆపివేసిన టీవీ9, ఏబీఎన్‌ ఛానల్స్‌ ప్రసారాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ జిల్లా శాఖ నాయకులు బుధవారం జిల్లా కలెక్టర్‌ జీడి ప్రియదర్శినిని కలిసి వినతి పత్రం సమర్పించారు. చానల్స్‌ ప్రసారాలను ఆపి వేయడం వల్ల మీడియా స్వేచ్చకు భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎం.ఎస్‌.ఓల పై ఒత్తిడి పెంచి ప్రసారాలను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు తాటి కొండ కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బండి విజయకుమార్‌, కోశాధికారి కె. ఉమామహేశ్వర్‌రావు, రాష్ట్ర కమిటి సభ్యులు ఎ.పరిపూర్ణం, జిల్లా ఉపాఽధ్యాక్షుడు కొమ్ము దామోధర్‌, విష్ణు, కె. సుకుమార్‌, చంద్రశేఖర్‌గౌడ్‌, మనోహర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.
వనపర్తిలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఓలను ఆదేశించి వెంటనే ఏబీఎన్‌, టీవి 9 చానెళ్ల ప్రసారాలను పునరుద్దరించాలని, టియూడబ్లూజే(ఐజెయు) అనుబంధం యూనియన్‌ నాయకులు మధుగౌడు, ఓంకార్‌, బాలస్వామిలు బుధవారం డిమాండ్‌ చేశారు. చానెళ్ల ప్రసారాలను పునరుద్దరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న జర్నలిస్టుల ధర్నాను పోలీసులు భగ్నం చేయడాన్ని వారు ఖండించా రు. వెంటనే రెండు చానెళ్ల ప్రసారాలు పునరుద్దరించాలని ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్య క్రమంలో జర్నలిస్టులు పౌర్ణారెడ్డి, పోలిశెట్టి బాలకృష్ణ, నాగేంద్రం, నిరంజన్‌, మతీన్‌, గోపాల్‌, మన్నాజీ, ప్రశాంత్‌, ప్రకాష్‌, రమేష్‌, భక్తరాజు, తదితరులు పాల్గొన్నారు.
నాగర్‌కర్నూల్‌లో ఏబీఎన్‌, టీవీ9 చానళ్లను వెంటనే పునరుద్ధరించాలని టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో బుధవారం ఆర్డీవో కార్యలయ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వరంగల్‌లో జర్నలిస్టులపై జరిగిన దాడి హేయమైన చర్య అన్నారు. చానళ్లను పునరుద్ధరించాలని శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న జర్నలిస్టులపై అమానుషంగా లాఠీచార్జి చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనన్నారు. వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి జర్నలిస్టులపై పెట్టిన కేసులను ఉపసంహరించేలా చర్యలు తీసుకోవాలని, చానళ్లను పునరుద్ధరించాలని కోరారు. కార్యక్రమంలో కే. మాధవరెడ్డి, యాదగిరి, పీ. వెంకటస్వామి, కే. రాజు, ఏ. వెంకటస్వామి, సీ. శ్రీనివాసులు, ఎం. రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.