desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:18AM

ప్రయోగాత్మక డ్రిప్‌ విధానంలో దానిమ్మ సాగు

మోపిదేవి : వరి, మొక్కజొన్న, చెరకు పంటలు సాగుకు వీలుగా ఉండే నల్లరేగడి భూమి దానిమ్మ పంటకు అనుకూలం కాకపోయినప్పటికీ ఆగ్రో ఇండసీ్ట్రగా ప్రసిద్దిగాంచాలనే లక్ష్యంతో మోపిదేవి మండలం మేళ్ళమర్తిలంకలో ఏకంగా 40 ఎకరాల్లో దానిమ్మ పంటసాగుకు చల్లపల్లి చినరాజా మనుమడు యార్లగడ్డ ప్రశాంత్‌ ప్రసాద్‌ సాహసోపేతంగా శ్రీకారం చుట్టారు. ఎంబీఏ విద్యనభ్యసించి వృత్తి రీత్యా మద్రాసులో ఉంటూ తమ ప్రాంతంలో తనకున్న సొంత భూములలో వ్యవసాయ పరిశ్రమలు స్థాపించాలనే లక్ష్యంతో వినూత్నంగా దానిమ్మ పంట సాగు చేపట్టారు. పంటకు ఈ ప్రాంత భూమి, అనుభవం గల కూలీల లభ్యత లేనప్పటికీ ప్రయోగాత్మకంగా చేపట్టారు. మేళ్ళమర్తిలంక గ్రామంలో జిల్లాలోనే ప్రప్రథమంగా పంటను సాగు చేస్తున్నారు. గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి 25 వేల మొక్కలను తీసుకువచ్చి ఏప్రిల్‌ నెలలో 40 ఎకరాల్లో నాటారు. బాహువా రకపు దానిమ్మ మొక్కలను, కర్నాటకకు చెందిన అనుభవం గల రైతులను తీసుకువచ్చి యాజమాన్య పద్దతులు పాటిస్తుండటం విశేషం. పంట 2 సంవత్సరాల కాలానికి వస్తుంది.
మొక్క నాటిన నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎకరాకు రూ.3 లక్షలు పెట్టుబడి అవుతుంది. నల్లరేగడి భూమి కావటంతో నీటి యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. డ్రిప్‌ విధానంలో సాగు చేపట్టడం వల్ల ఎరువులు, రసాయనాలు కూడా పైపుల ద్వారానే వేస్తున్నట్లు రైతు తెలిపారు. మహారాష్ట్రలో అధికంగా దానిమ్మ పంటను సాగు చేస్తుంటారని, మన జిల్లాలోనూ పంటను సాగు చేసి, రైతులు, కూలీలకు సాగు విధానాలపై అవగాహన కల్పించి ఆగ్రో ఇండసీ్ట్రగా ఈ ప్రాంతాన్ని మార్చాలన్నదే ఆయన లక్ష్యంగా పేర్కొన్నారు. రసాయన ఎరువుల వాడకం వలన మొక్కలు ఏపుగా, దట్టంగా పెరిగి నాణ్యమైన దిగుబడి సాధించాలన్నదే ఆయన లక్ష్యం. దానిమ్మ కాయలు ఒక్కొక్కటి 1.2 కేజీల బరువు ఉండే మొదటి రకమని, దుబాయ్‌ మార్కెట్‌కు తరలించనున్నట్లు ప్రశాంత్‌ ప్రసాద్‌ తెలిపారు. నాణ్యమైన దిగుబడి సాధించే లక్ష్యంగా ప్రతి రోజు తోటలో యాజమాన్య పద్దతులు తప్పనిసరిగా పాటిస్తున్నామన్నారు. ప్రయోగాత్మకంగా జిల్లాలోనే ప్రప్రథమంగా 40 ఎకరాల్లో ఈ సాగు చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రోత్సాహం అందలేదన్నారు. పంటసాగుకి అవసరమైన ప్రతి వస్తువుకూ, విజయవాడ వెళ్ళాల్సివస్తోందన్నారు. మొక్కలు గుబురుగా, ఏపుగా పెరుగుతుండటంతో తరచూ కత్తిరించాల్సి ఉంటుంది. ఈ ప్రాం తంలో అనుభవం గల కూలీలు అందుబాటులో లేనందున కర్నాటకకు చెందిన కూలీలను తీసుకువస్తున్నట్లు చెప్పారు. రాబోయే సంవత్సరకాలంలో 200 నుంచి 300 ఎకరాల్లో సాగు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.