Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:18AM

డ్రైవర్ల అప్రమత్తతతో ప్రమాదాలు దూరం

విజయవాడ సిటీ : డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు నివారించడం సాధ్యమవుతుందని విజయవాడ పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శ్రీనివాస్‌ (నాని) అన్నారు. జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో బాపులపాడు మండలం అంపా పురంలో నిర్వహించిన మోడల్‌ డ్రైవింగ్‌ ఇనిస్టిట్యూట్‌, రీసెర్చి సెంటర్‌లో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌లో శిక్షణ పొందిన డ్రైవర్లకు బుధవారం సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా పాల్గొన్న ఎంపీ కేశినేని మాట్లాడుతూ ప్రమా దం జరిగితే ముందు నష్టపోయేది డ్రైవరు, అతని కుటుంబమేనన్నారు. అపాయం పొంచిఉందని భావిస్తూ డ్రైవింగ్‌ చేసినపుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. భారతదేశంలో డ్రైవింగ్‌ చేయటం కత్తిమీద సాము వంటిదని, సరైన శిక్షణ లేకపోయినా, రోడ్డు నియమ నిబంధనల పట్ల అవగాహన లేకపోయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అన్నారు. డ్రైవర్లు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి వాహనాలు నడపాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్‌ చేస్తే దేశానికి సేవ చేసినట్టేనని అన్నారు. ఈ విషయంలో తన సహాయం సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. జిల్లా లారీ యజమానుల సంఘం నాయకులు సమాజ హితం కోరి తమ సొంత ప్రయోజనాలు సైతం పక్కన పెట్టి డ్రైవర్లకు పటిష్టమైన శిక్షణ అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని ప్రతి డ్రైవర్‌ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షులు కె.వి.రమేష్‌ అఽధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్‌ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వై.వి.ఈశ్వరరావు, జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి నాగుమోతు రాజా పాల్గొని మాట్లాడారు.