Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:17AM

నారుమళ్లకు నీరందించండి

ఘంటశాల : నారుమళ్లకు నీరందించాలని లంకపల్లి సర్పంచ్‌ మాడెం నాగరాజు డిమాండ్‌ చేశారు. బుధవారం లంకపల్లిలోని నీరులేక ఎండిన నారుమళ్లను ఆ గ్రామ రైతులతో కలిసి సర్పంచ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంకపల్లి గ్రామ పరిధిలోని భీమనది ఛానల్‌ పరిధిలో సుమారు 800ల ఎకరాలకు పైగా సాగుభూమి ఉందన్నారు. సాగునీరు నేటికి అందకపోవడంతో వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. భీమనది ఛానల్‌ పరిధిలోని వీరంకిలాకు నుంచి లంకపల్లి వరకు వందలాదికిపైగా అనధికారిక తూములు ఉన్నప్పటికీ అధికారులు వాటిని తొలగించకపోవడంతో సాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై సంబంఽధిత శాఖాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రెండు రోజుల్లో లంకపల్లి పరిధిలో ఉన్న భీమనది ఛానల్‌కు సాగునీరు విడుదల చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు వి.రామకృష్ణ ప్రసాద్‌, చంద్రశేఖర్‌రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.