Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:17AM

రెగ్యులర్‌ వైద్యుడిని నియమించాలని..


దేవరకద్ర: మండల కేంద్రంలోని ప్రాథమి క ఆరోగ్య కేంద్రంలో రెగ్యులర్‌ వైద్యుడిని ని యమించాలని బుధవారం జడ్పీటీసీ బల్సుప ల్లి లక్ష్మీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు గంటల పాటు ధర్నా చేపట్టారు. ఆయుర్వేదిక్‌ మెడిక ల్‌ వైద్యుడు ఆనంద్‌ కుమార్‌రెడ్డితో పాటు ఆ స్పత్రి సిబ్బంది ఏపీఎంఓ ప్రేమ్‌సాగర్‌, పార్మసిష్టు శివకుమార్‌ ధర్నాను విరమించాలని జ డ్పీటీసీని కోరగా, డీఎంఅండ్‌హెచ్‌ఓ ఇక్కడికి వచ్చి రెగ్యులర్‌ డాక్టర్‌ను నియమించే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చి చెప్పారు. దీం తో ఆయుర్వేదిక్‌ డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌రెడ్డి జి ల్లా వైద్యాధికారి సరస్వతికి పరిస్థితి వివరించ గా, ఆమె పీహెచ్‌సీకి చేరుకుని ధర్నాను విరమింపజేశారు. ఆత్మకూర్‌ సివిల్‌ ఆస్పత్రిలో వి ధులు నిర్వహించే ఎస్‌.లక్ష్మణ్‌ను తాత్కలిక డా క్టర్‌గా నియమించారు. త్వరలో రెగ్యూలర్‌ వై ద్యుడిని నియమించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పీహెచ్‌సీలతో పాటు ఆరోగ్య ఉప కేంద్రాలను బలోపేతం చే సేందుకు కృషి చేస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అమలు చేసే ప్రభుత్వ పథకాలను అమ లు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ధర్నా కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కొండ చం ద్రకళారెడ్డి, దేవరకద్ర-2 ఎంపీటీసీ ఉస్కిల్ల వెం కట్రాములు, నాయకులు అంజన్‌కుమార్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, నారాయణరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, ఉ స్కిల్ల రాజు, రామాస్వామి, ఎద్దుల కృష్ణయ్య, గిడ్డెరాము, జి.తిరుపతయ్య పాల్గొన్నారు.ఖీ=్టటఠ్ఛ-జ.్గఖిృఆజవేఠ్త్రఖూ