Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:16AM

ఉత్సవాల కోసం 16 లక్షల లడ్డూ ప్రసాదం

(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
ఈ ఏడాది దసరా ఉత్సవాలకు అత్యధికంగా భక్తులు వస్తారన్న అభిప్రాయంతో 16లక్షల లడ్డూలను సిద్ధంచేస్తున్నామని దుర్గగుడి ఈవో త్రినాథ్‌ తెలిపారు. గత ఉత్సవాల సమయంలో రాష్ట్రంలో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగడం, రవాణా సదుపాయం లేకపోయినా 11 లక్షల లడ్డూ ప్రసాదం వికయ్రించామన్నారు.
ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఆయన క్యూలు, బారికేడ్లు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. కెనాల్‌ రోడ్డులో వినాయకుడి గుడి వద్ద, సీతమ్మవారి పాదాల వద్ద ఆయన భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణ ఇంజనీర్లు కోటేశ్వరరావు, బాల మురళీకృష్ణ, ఉప కార్యనిర్వహణ ఇంజనీర్లు రమాదేవి, వెంకటేశ్వరరావు, సహాయ ఇంజనీర్లు అశోక్‌, విఖ్యాత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ 22 తేదీ నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులకు మంచినీటి సరఫరా చేయడానికి ఒక్కో ప్యాకెట్‌ 0.45 పైసల చొప్పున 26 లక్షల ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. భక్తులకు అస్వస్థత చేకూరితే సత్వర చికిత్సకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారిశుధ్యంపై కూడా దృష్టి పెట్టామని, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో పనులు నిర్వహించేందుకు షిఫ్టుకు 266 మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్య పనుల నిర్వహణకు కార్పొరేషన్‌ సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు. ఘాట్లలో జల్లు స్నానాల కోసం మొత్తం 800 పంపులను, 190 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.