desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:13AM

స్వచ్ఛంద సంస్థ పేరుతో అక్రమాలు

గండేపల్లి: ఛాంపియన్స్‌ హౌస్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సేవా సంస్థ చిన్న పిల్లల ఫొటో లు సేకరించి వాటిని వెబ్‌సైట్‌లో పెట్టి వారు అనాథలని చెప్పి అక్రమాలు సాగించే వైనం బుధవారం గండేపల్లి మండలంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. గండేపల్లి గ్రామానికి చెందిన దుబ్బాకుల కామేశ్వరరావు, నాగమణికు ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మా యి ఉన్నారు. గండేపల్లిలో ఉన్న ఛాంపియన్స్‌ హౌస్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ కామే శ్వరరావు, నాగమణి కుమార్తె శ్రావణి ఫొటో సేకరించి వెబ్‌సైట్‌లో పెట్టి ఆ బాలిక తల్లిదండ్రులు చనిపోయారని అనాథఅని ఆమెను ఈ స్వచ్ఛంద సంస్థ ఆదరించిందని ఈసంస్థకు ఇంకా నగదు ప్రోత్సాహకం చేస్తే ఇంకా అనా థలను ఆదరిస్తామని చెప్పి అక్రమాలకు పా ల్పడుతున్నారు. శ్రావణి ఫొటోను ఇంటర్‌నెట్‌లో చూసిన కామేశ్వరరావు, నాగమణిల బం ధువులు వారికి ఫోన్‌చేసి హీనంగా మాట్లాడుతున్నారని వాపోయారు. సంస్థను నడుపుతు న్న సీహెచ్‌.గబ్రేయన్‌, సుదర్శన్‌ శామ్యూల్‌పై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాల ని కామేశ్వరరావు, నాగమణి దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.