Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:13AM

రైల్వే ఏఆర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ వీరంగం!

ఆనందనగర్‌/సిటీ: రాజమండ్రి రైల్వే స్టే షన్‌లో మంగళవారం అర్థరాత్రి విజయవాడ కు చెందిన రైల్వే ఏఆర్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ వీరంగం సృష్టించాడు. హైదరాబాద్‌కు చెందిన వెంకటలక్ష్మి అప్పారావు దంపతులు తమ కు మార్తె నాగరాజేశ్వరికి నాటు వైద్యం చేయించేందుకు రంపచోడవరం తీసుకువచ్చారు. వై ద్యం చేయించి తిరిగి వారు రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే రాత్రి 11 గంటలు దాటడంతో తెల్లవారుజామున రెండు గంటలకు విజయవాడ వైపు వెళ్లే రైలు ఎక్కేం దుకు రైల్వేస్టేషన్‌లోని వెయిటింగ్‌ రూమ్‌లో వేచి ఉన్నారు. ఇంతలో అటుగా వచ్చిన కానిస్టేబుల్‌ కమలాకర్‌ వారిని అక్కడ నుంచి వెళ్లిపోమ్మని కర్రతో ముగ్గురిపైన దాడి చేశాడు. అక్కడ ఉన్న తోటి ప్రయాణికులు కానిస్టేబుల్‌ వైఖరిని నిరసిస్తూ ఎదురుతిరగడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. గాయపడిన వెంకటల క్ష్మి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కానిస్టేబుల్‌ మద్యం మత్తులో వెయిటింగ్‌ రూమ్‌కు చేరుకుని లాఠీతో దాడి చేశాడన్నారు. అతడిపై జీ ఆర్పీస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామన్నారు. కానిస్టేబుల్‌ విజయవాడ నుంచి అప్పుడప్పుడు నైట్‌ రౌండ్స్‌లో రాజమండ్రి రైల్వేస్టేషన్‌ వస్తుంటాడ ని అతనిపై చర్యలు తీసుకొనేందుకు అధికారులు ఫిర్యాదును పరిశీలిస్తున్నట్టు తెలిసింది.