Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:12AM

సీఎంతో మాట్లాడి జిల్లాకు ఎక్కువ నిధులు


ఖమ్మం అర్బన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి జిల్లాకు ఎక్కువ నిధులు వచ్చేలా కృషిచేస్తానని జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత పేర్కొన్నారు. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఆమె బుధవారం రఘునాధపాలెం మండలప్రజాపరిషత్‌ కార్యాలయానికి వచ్చారు. ఈసందర్భంగా ఎంపీడీవో చంద్రశేఖర్‌, జడ్పీటీసీ సభ్యుడు వీరూనాయక్‌, ఎంపీపీ మాళోత్‌ శాంత తదితరులు కవితకు సన్మానంచేశారు. అనంతరం ఆమె ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశమ య్యారు. ఈసందర్భంగా పంచాయతీ కార్యదర్శుల కొరతను చైర్‌పర్సన్‌ కవిత దృష్టికి తెచ్చారు. కార్యదరులు తక్కువగా ఉండటంవల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నదని వివరించారు. స్పందించిన కవిత మాట్లాడుతూ ముంపు మండలాల్లో ఉన్న పంచాయతీ కార్యదర్శులను జిల్లాలో కార్యదర్శులు కొరత ఉన్న మండలాలకు కేటాయించాలని కలెక్టర్‌ను కోరనున్నట్టు వివరించారు. గతంలో జడ్పీ పాలకవర్గం లేకపోవడంతో జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన బీఆర్‌జీఎఫ్‌ నిధులను సకాలంలో వినియోగించే నిమిత్తం అధికారులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. సమస్యలు తనదృష్టికి తెస్తే పరిష్కారానికి కృషిచేస్తానని చైర్‌పర్సన్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, ఈవోఆర్డీ ప్రభాకర్‌రావు, ఎంపీపీ మాళోత్‌ శాంత, జెడ్పీటీసీ వీరూనాయక్‌, సూపరింటెండెంట్‌ వేణు మాధవ్‌, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఠ్ఛిుఽ రోౖఆ=