Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:12AM

పసి ‘కను’ పాపకు అరుదైన శస్త్ర చికిత్స

కాకినాడ రూరల్‌: 45 రోజుల పసిపాప కంటికి అరుదైన శస్త్ర చికిత్స చేసి చిన్నారి కంటిచూపును రక్షించిన ఘనత కాకినాడ రూరల్‌ మండలం పెనుమర్తిలోని కిరణ్‌ కంటి ఆసుపత్రి వైద్యులకు దక్కింది. దీనికి సంబంధించి ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ సంకురాత్రి చంద్రశేఖర్‌ వివరాలు తెలిపారు. కాకినాడ మధురానగర్‌కు చెందిన నిడిగట్టు రామకృష్ణ, సునీత దంపతులకు కంటికి రెటీనా వ్యాధితో చిన్నారి జన్మించింది. కాకినాడ ఆసుపత్రిలో పుట్టిన ఈ బిడ్డకు కంటి పనితీరుపై కంటి వైద్యులను సంప్రదించాలని సూచించడంతో కిరణ్‌కంటి ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రి విట్రియో రెటీనల్‌ సర్జన్‌ డాక్టర్‌ సుందీప్‌ రెడ్డి పరీక్షించి మొదటిదశగా కంటికి ఉచితంగా లేజర్‌ చికిత్సను నిర్వహించారు. అనంతరం అత్యంత ఆధునిక పరికరాలతో ఖరీదైన రెటీనా శస్త్ర చికిత్సను సుమారు 3గంటల సమయంలో దిగ్విజయంగా పూర్తి చేసినట్టు తెలిపారు. అనంతరం డాక్టర్‌ సందీప్‌ రెడ్డి మాట్లాడుతూ గర్ణిణీలకు నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ఇలాంటి లోపాలు సంభవిస్తాయని ఈ సమయంలో సరైన వైద్యం అందించగలిగితే వారికిశాశ్వత అంధత్వం నుంచి కాపాడవచ్చన్నారు. చికిత్స ఆలస్యం అయితే వారు శాశ్వత అంధులుగా మారిపోయే ప్రమాదం ఉందని సూచించారు. ఇలాంటి శస్త్ర చికిత్స మొట్ట మొదటి సారిగా ఇక్కడ నిర్వహించినట్టు తెలిపారు. అయితే ఈశస్త్ర చికిత్స ఖరీదైన వైద్యంతో కూడిందన్నారు. శస్త్ర చికిత్సకి ఆసుపత్రి ఎండీడాక్టర్‌ సుంకురాత్రి చంద్రశేఖర్‌, మత్తుమందు వైద్యులు డాక్టర్‌ కిశోర్‌ కుమార్‌, నియోనేటర్‌ కేర్‌ స్పెషలిస్టు డాక్టర్‌ రవి, ఆసుపత్రి సిబ్బంది పూర్తిసహకారం అందించినట్టు తెలిపారు.