Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:12AM

జర్నలిస్టులపై దాడికి యువమోర్చా నిరసన

అమలాపురం టౌన్‌: తెలంగాణలో జర్నలిస్టులపై జరిగిన దాడిని నిరసిస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో బుధవారం అమలాపురంలో ఆందోళన నిర్వహించారు. తెలంగాణలో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ9 ఛానళ్ల ప్రసారాలను నిలుపుదల చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని నినదించారు. మహిళా జర్నలిస్టులపై తెలంగాణ పోలీసుల దాడిని హేయమైన చర్యగా అభివర్ణించారు. భారతీయ జనతా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి యల్లమిల్లి కొండ ఆధ్వర్యంలో బీజేపీ, యువమోర్చా నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌.. మహిళా జర్నలిస్టులపై దాడి అమానుషం, ఏబీఎన్‌, టీవీ9 ఛానల్స్‌ ప్రసారాలను తెలంగాణలో పునరుద్ధరించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తెలంగాణలో బతకాలి అంటే సలామ్‌ కొట్టాల్సిందేనని కేసీఆర్‌ అనడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్‌ పద్ధతి మార్చుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా యువమోర్చా ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని యల్లమిల్లి కొండ హెచ్చరించారు. అనంతరం గడియార స్తంభం సెంటర్లో కేసీఆర్‌ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. ఆందోళనలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆర్‌వీ నాయుడు, బసవా శివరామప్రసాద్‌, ముదునూరి రంగరాజు, యల్లమిల్లి పాండురంగారావు, నిమ్మకాయల రెడ్డినాయుడు, బసవా సత్యసంతోష్‌, శ్రీమంతుల పవన్‌, యర్రంశెట్టి చిరంజీవి, కాటా బాలయ్య, సలాది నాగేశ్వరరావు, కన్నీడి ప్రభు, మాధవ్‌ తదితరులు పాల్గొన్నారు.
రాజోలు: శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా జర్నలిస్టులపై దాడి అమానుషమని రాజోలు తాలూకా జర్నలిస్టులు మండిపడ్డారు. బుధవారం తాటిపాక సెంటర్లో రాజోలు తాలూకా ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియా జర్నలిస్టులు కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. వీరికి పలువురు రాజకీయ నాయకులు మద్దతు తెలిపారు. కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌, తెలంగాణలో ఏబీఎన్‌, టీవీ9 ఛానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. ఆందోళనలో ఎన్‌.ప్రసాద్‌, ఎం.వెంకటేశ్వరరావు, మితీష్‌, యు.ప్రదీప్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌, రాజు, ఎస్‌.వెంకటేశ్వరరావు, మాదిగ రిజర్వేషన్‌ సంఘర్షణ సమితి అధ్యక్షుడు తెన్నేటి కిషోర్‌, పోతు కాశి, జక్కంపూడి వాసు పాల్గొన్నారు.