desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:12AM

పొగరాయుళ్లకు.. చెక్‌

(ఆంధ్రజ్యోతి-కాకినాడ)
పొగరాయుళ్లకు చెక్‌ పెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల బడ్జెట్‌లో సిగరెట్ల ధరలను ఓ మోస్తరుగా పెంచిన ప్రభుత్వం ఇప్పుడు బహిరంగంగా పొగతాగే వారిపై నిఘా పెట్టడానికి సమయాత్తమైంది. తద్వారా లూజ్‌గా సిగరెట్లు కొనడం, అమ్మడంపై నిషేధం విధించాలని భావిస్తోంది. వీటిని ఉల్లంఘిస్తే సదరు పాన్‌ షాపుల యజమానులపైన, కొనుగోళ్లదారులపైన జరిమానాలు విఽధించాలని సిద్ధమవుతోంది. ఈ పరిణామం ఐటీసీలాంటి సిగరెట్‌ కంపెనీలపై ప్రభావం పడనుంది. దేశవ్యాప్తంగా సిగరెట్ల అమ్మకాలు ఎక్కువగా లూజ్‌గానే జరుగుతుండడంతో సిగరెట్‌ కంపెనీలపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం పడనుంది. సాధారణంగా ప్యాకెట్లు కొనుక్కుని సిగరెట్లు కాల్చేవారు తక్కువగా ఉండటం, ఏ పూటకాపూట సిగరెట్లు కాల్చేవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల లూజు విక్రయాలు ఇక నుంచి భారీగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో సిగరెట్టు తాగితే కనిష్టంగా రూ.200 నుంచి గరిష్టంగా రూ.20 వేల వరకు జరిమానా విధించే విషయంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. సిగరెట్టు తాగడానికి కనీస వయస్సును కూడా పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ ప్రతిపాదనలు అన్నింటికీ కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపితే పొగరాయుళ్లు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్ధితి ఏర్పడక తప్పదు. సిగరెట్లు ప్యాకెట్ల మీద బొమ్మసహా చట్టబద్దమైన హెచ్చరికలను ముద్రించకపోతే ఇప్పటి వరకు రూ.5 వేలు జరిమానా మాత్రమే విధించేవారు. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.50 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తుంది. సిగరెట్లు కాల్చడానికి, కొనడానికి ఇప్పటి వరకు కనీస వయోపరిమితి 18 ఏళ్ళు ఉండగా దీన్ని 25 ఏళ్ళకు పెంచాలనుకుంటుంది.