Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:12AM

ఏబీఎన్‌ ప్రసారాలను పునరుద్ధరించాలి


భద్రాచలం: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్‌, టీవీ9 చానెళ్ల ప్రసారాలను నిలిపివేతకు నిరసనగా భద్రాచలంలో బుధవారం జర్నలిస్టులు ఆందోళన నిర్వహించారు. నల్ల బాడ్జీలు ధరించి స్ధానిక టీ టూరిజం హోటల్‌ నుంచి ప్రారంభమైన ప్రదర్శన బ్రిడ్జి సెంటర్‌ వరకు సాగింది. అనంతరం బ్రిడ్జి సెంటర్‌లో జర్నలిస్టులు మీడియాకు సంకెళ్ళా?, ఇది తెలంగాణ ప్రజా స్వామ్యమా?, ఏబీఎన్‌, టీవీ9 చానళ్ళ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. అనంతరం భద్రాచలం ఆర్డీవో ఆర్‌ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు బీవీ రమణారెడ్డి, కోనా ఆనంద్‌ కుమార్‌, కనుకు వెంకటేశ్వర్లు, ఎం ఆనంద్‌ కుమార్‌, ఐ ముద్దు కృష్ణ, అనీల్‌ రెడ్డి, సలీమ్‌, చిన్నికృష్ణ, మురళీ, శ్రీను, శ్రీనివాస్‌, జి రమేష్‌, కిరణ్‌, ప్రసాద్‌, గణేష్‌, పాల్గొన్నారు. కాగా జర్నలిస్టులకు సిపిఎం, సిపిఐ, టిడిపి, బీజేపి కాంగ్రెస్‌, నాయకులు సంఘీభావం తెలిపారు.