Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:11AM

టీడీపీని భూస్థాపితం చేసేశక్తి ఎవరికీ లేదు


భద్రాచలం: టీడీపీని భూ స్థాపితం చేసేశక్తి ఎవరికి లేదని అలా ప్రకటించిన వారందరు కాలగర్భంలో కలిసిపోయారని జిల్లా అధ్యక్షులు తుళ్లూరి బ్రహ్మయ్య అన్నారు. భద్రాచలంలో బుధవారం రాత్రి ఆయన విలేకరలతో మాట్లాడుతూ అధికార దాహంతో కొందరు పార్టీని వీడారని ఆరోపించారు. అంతేకానీ పార్టీ ఆవిర్భావం నుంచి కంటికి రెప్పల కాపాడు కుంటున్న కార్యకర్తలెవ్వరు టీడీపీని వదల్లేదన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ స్ధానంలో పార్టీ అభ్యర్ధి ఫణీశ్వరమ్మ ఓటమి పాలవ్వడానికి పార్టీ ద్రోహులే కారమన్నారు. సమావేశంలో టీడీపీ నియోజక వర్గం ఇంచార్జ్‌ కొమరం ఫణీశ్వరమ్మ, మస్తాన్‌ కోనేరు రాము, వట్టికొండ రాము, నర్రా రాము. వల్లభనేని చందు, అన్నెం వెంకట్‌ పాల్గొన్నారు.
వెంకటాపురం: 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన వెంకటాపురం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ లాంటి నాయుకులు పార్టీని వీడినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి ఢోకా లేదన్నారు. పార్టీని జిల్లాలో బలోపేతం చేసి చూపిస్తానని, ఇదే తనముందున్న కర్తవ్యమని, చంద్రబాబు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. కార్యక్రమంలో భద్రాచలం డివిజను పార్టీ భాద్యురాలు కొమరంఫణీశ్వరమ్మ, సర్పంచ్‌ అట్టంసత్యనారాయణ, నాయుకులు గుడవర్తి నర్సింహమూర్తి, ఆత్మకూరి పట్టాభి, రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.గఙఔ6,రోఆ