Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 04:11AM

సర్కిళ్లకు పదోన్నతులు!

పోలీసు శాఖలో సమూల మార్పులు చేపట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రజలకు మరింత దగ్గరవ్వాలన్నా యోచనలో సీఎం చంద్రబాబునాయుడు, హోం మంత్రి చినరాజప్ప పోలీసు ఉన్నతాధికారులతో ప్రాథమికంగా చర్చలు జరిపారు. ఇందులో పోలీసు సర్కిల్‌ స్థానాలను డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించేందుకు సమీక్షించినట్లు తెలిసింది. ప్రస్తుతం సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారిగావున్న
డీఎస్పీకి మూడు నుంచి 4 సర్కిల్‌ పరిధిలో పోలీస్‌స్టేషన్‌లలో క్రైం తీరును పర్యవేక్షించాల్సి వుంది. దీనితో ఒక విధంగా సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారిపై ఒత్తిడి అధికంగా ఉన్నట్లు గుర్తించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు కాక హైవేలలో భారీ ప్రమాదాలను, భారీ చోరీలను నిరోధించేందుకు సైతం కష్టతరంగా మారింది. కొన్ని డీఎస్పీల పరిధిలో అధిక మండలాలు, మున్సిపాల్టీలు ఉండడంతో ఒక విధంగా డీఎస్పీ పోస్టు నిర్వహణ కత్తి మీదసాముల తయారైంది. దీనితో కిందిస్థాయి అధికారులై డీఎస్పీస్థాయి అధికారి ఆధారపడాల్సి వస్తోంది. మరోపక్క సైబర్‌ నేరాలు అధికంగా పెరగడంతో మరో విధంగా అదనపు భారంగా మారింది. వీటన్నిటిపైనా అధ్యయనం చేసిన ప్రభుత్వం ప్రతీ సబ్‌ డివిజన్‌ పరిఽధిలోని రెండు నుంచి మూడు డీఎస్పీ పోస్టులను సృష్టించేందుకు పరిశీలిస్తోంది. ఒక పట్టణ పోలీస్‌స్టేషన్‌తోపాటు నాలుగు పోలీస్‌స్టేషన్‌లను ఒక సబ్‌ డివిజన్‌ పరిధిలోకి తీసుకురానున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అమలులో ఉన్న సీఐలందరికి డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించి పోస్టింగ్‌లు ఇవ్వడం ద్వారా నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇదే క్రమంలో క్రైం బ్రాంచ్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, ఏసీబీ, ఇంటెలిజెన్స్‌లతోపాటు మరికొన్ని విభాగాలకు డీఎస్పీస్థాయి అధికారులను నియమించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇదే అమలులోకి వస్తే జిల్లావ్యాప్తంగా వున్న 30 సర్కిళ్లు సబ్‌ డివిజనల్‌ పోలీసు కార్యాలయాలుగా మారతాయి. పెద్దాపురం డీఎస్పీ పరిధిలోని పెద్దాపురం సర్కిల్‌, జగ్గంపేట సర్కిల్‌, ప్రత్తిపాడు సర్కిల్‌, తుని అర్బన్‌, రూరల్‌ సర్కిల్‌, సీసీఎస్‌ క్రైం సర్కిల్‌ వెరసి 6 సర్కిల్‌లు ఉండగా వీటిని డీఎస్పీ స్థాయికి పదోన్నతి కల్పించాలి. ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగిన తరువాత తెలంగాణ ప్రభుత్వం పోలీసు వ్యవస్థలో కొత్తమార్పులు తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలీసుశాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నూతన ప్రక్రియ వలన ప్రభుత్వానికి అదనంగా ఎటువంటి వ్యయభారం ఉండదని ఆయా సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించారు. ప్రస్తుతం సర్కిల్‌ కార్యాలయాలన్నీ డీఎస్పీ స్టేషన్‌లుగా మార్చి అవే వాహనాలను వారికి కేటాయిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఒక డీఎస్పీని కేటాయించే అంశంపైన పరిశీలనలోవుంది. నివేదికలను అన్ని సబ్‌ డివిజన్‌ కార్యాలయాల నుంచి జిల్లా ఉన్నతాధికారులు సేకరించి ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ఈ విధానం అమలుపై పోలీసు అదికారులలో సైతం ఉత్కంఠత నెలకొన్నది.