Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:47AM

పాఠశాల విద్య డిప్యూటీ డైరెక్టర్‌ సస్పెన్షన్‌


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్య డిప్యూటీ డైరెక్టర్‌ పి. బుచ్చన్నను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పరుచూరి శివరామకృష్ణ నుంచి గత నెల 8న రూ. 6 వేలు లంచం తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం బుచ్చన్నను బుధవారం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు విధుల నుంచి సస్పెండ్‌ చేసింది.