Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:45AM

‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ యూట్యూబ్‌లో టాప్‌


మరే తెలుగు న్యూస్‌ చానల్‌కు లేనంత ఆదరణ
తెలుగు న్యూస్‌ చానళ్లలోకెల్లా అత్యధిక సబ్‌స్ర్కైబర్స్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 10: సోషల్‌ మీడియాలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌కు రికార్డు స్థాయిలో ఆదరణ లభించింది. మరే తెలుగు చానల్‌కు లేని స్థాయిలో యూట్యూబ్‌లో అత్యధికంగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం నెటిజన్లు సబ్‌స్ర్కైబ్‌ చేశారు. తెలుగు న్యూస్‌ చానళ్లలో మరే చానల్‌కు లేనంత మంది సభ్యులు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతికి యూట్యూబ్‌లో ఉన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న నెటిజనాదరణతో బుధవారానికి లక్షా 35 వేల పై చిలుకు సబ్‌స్ర్కైబర్స్‌తో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి యూట్యూబ్‌లో ప్రథమస్థానంలో నిలిచింది. దీంతో చానల్‌కు యూట్యూబ్‌ సంస్థ ఒక జ్ఞాపికను అందజేసింది.
ప్రతి ఆదివారం రాత్రి ప్రసారమయ్యే ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’, ప్రతి శనివారం ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇచ్చే విశ్లేషాత్మక కథనంతో పాటు, బిగ్‌ డిబేట్‌, ఓపెన్‌ డిబేట్‌ లాంటి ఎన్నో కార్యక్రమాలు యూట్యూబ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సోషల్‌ మీడియాలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ దూసుకుపోతోంది.