Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:39AM

ఎక్సైజ్‌ అధికారుల దాడి : 8 మంది అరెస్ట్‌


మర్పల్లి : గ్రామాల్లో దాడులు నిర్వహించి మూడున్నర కిలోల గంజాయి, 468 లీటర్ల కల్తీ కల్లు ధ్వంసం చేసి నాలుగు లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకోవడం జరిగిందని మర్పల్లి ఎక్సైజ్‌ సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. బుధవారం సుల్తాన్‌పూర్‌, జిన్నారం, బొప్పునారం, నర్సపూర్‌, బూచన్‌పల్లి గ్రామాల్లో ఎక్సైజ్‌ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. బూచన్‌పల్లి గ్రామంలో తాండూరు బూరానొద్దీన్‌ దుకాణంలో మూడు కిలోల గంజాయి, దామస్తాపూరం బక్కయ్య దుకాణంలో అర కిలో గంజాయి స్వాధీనం చేసు కున్నామని ఎక్సైజ్‌ సీఐ అశోక్‌కుమార్‌ చెప్పారు. కొంత కాలంగా బక్కయ్య పొలంలో గంజాయి పండించి బూరానోద్దీన్‌కు విక్రయిస్తున్నాడన్నారు. బూరానొద్దీన్‌ చిన్నదుకాణాల్లో గంజాయి అమ్ము తున్నాడని తెలిపారు. అంతేకాకుండా గ్రామం లో కొందరు చెరుకు తోటలు, ఇతర ప్రాంతాల్లో గంజాయి పండించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారని సమాచారం ఉందనీ, త్వరలో వారి పై కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. సుల్తాన్‌పూర్‌, జిన్నారం, బొప్పునారం, నర్సపూర్‌ గ్రామాల్లో పిచ్చకుంట్ల భీమయ్య, ఈడ్గి శ్రీనయ్య, నర్సింహులు, మహేందర్‌లు కల్తీ కల్లు విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో సోదా చేయగా 468 లీటర్ల కల్తీ కల్లు లభించిందన్నారు. కల్లు సీసాలు ధ్వంసం చేశామన్నారు. నర్సపూర్‌ గ్రామంలో ఆంబోతు శేఖర్‌, ప్రేమ్‌సింగ్‌ నాటు సారా తయారుచేసి గ్రామంలో విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో వారి ఇళ్లను సోదా చేసి నాలుగు లీటర్ల సారా స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గంజాయి, కల్లు,నాటుసారా విక్రయిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు ఆయన తెలిపారు. దాడుల్లో ఎక్సైజ్‌ సీఐ శ్రీనివాస్‌తో పాటు ఎక్సైజ్‌ సిబ్బంది పాల్గొన్నారు.