Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 11 2014 @ 03:38AM

రిజర్వు ఫారెస్టులో అక్రమంగా మైనింగ్‌


అనంతగిరి : అక్రమంగా రిజర్వు ఫారెస్ట్‌లో మైనింగ్‌ జరుగుతుందని దీనికి రెవెన్యూ అధికారులే అనుమతులు ఇచ్చారని డీఎఫ్‌ఆర్‌వో మాధవరావు అన్నారు. బుధవారం వికారాబాద్‌ ఫారెస్ట్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతూ అక్రమంగా రిజర్వు ఫారెస్ట్‌లో మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. వికారాబాద్‌ మండల పరిధిలోని గెరిగేట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో రిజర్వు ఫారెస్ట్‌ అయిన సర్వే నెంబర్‌ 148లో 81 ఎకరాల, సర్వే నెంబర్‌ 229లో 309 ఎకరాలలో రెవెన్యూ అధికారులు అవగాహన లేకుండా మైనింగ్‌కు ఇచ్చారని ఆయన తెలిపారు. ఇలా రెవెన్యూ అధికారులు ఏ మాత్రం అవగాహన లేకుండా ఫారెస్ట్‌ భూములను మైనింగ్‌కు ఇవ్వడం మూలంగా అటవీ సంపదకు విఘాతం కలుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం తహసీల్దార్ల ద్వారా అటవీ శాఖ భూముల గుర్తింపు పత్రాలను పొందడం జరుగుతుందన్నారు. 2004 సంవత్సరంలో సర్వే నెంబర్‌ 148, 228లలో రిజర్వు ఫారెస్ట్‌ కింద 390 ఎకరాల భూములు ఉన్నట్లు సర్టిఫికెట్‌ పొందడం జరిగిందన్నారు. అక్రమంగా రిజర్వు ఫారెస్ట్‌లో జరుగుతున్న మైనింగ్‌ను ఆపి వేయాలని క్రషర్‌ మిషన్‌ల నిర్వాహకులకు తెలపడం జరిగిందన్నారు. మైనింగ్‌ చేసేందుకు ప్రయత్నిస్తే వాహనాల యంత్రాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. వికారాబాద్‌ ఫారెస్ట్‌ డివిజన్‌ పరిధిలో 150 చదరపు కిలో మీటర్ల అటవీ భూములు ఉన్నాయన్నారు. రాజీవ్‌ నగర్‌ కాలనీ సమీపంలో ఫారెస్ట్‌ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రహారీగోడ నిర్మించేందుకు 1.5 కిలో మీటర్ల గోడ కోసం ప్రతిపాదనలు పంపించామన్నారు.